ప్రచారం.. ఉధృతం

Mon,November 19, 2018 01:05 AM

ఆదిలాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : ఎన్నికలు సమీపిస్తుండడంతో జిల్లాలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఆదివారం ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ నాయకులు పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. తలమడుగు మండలం దేవాపూర్‌లో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఆదిలాబాద్ పట్టణంలో మంత్రి జోగు రామన్న, తాంసి మండలం పొన్నారిలో ఎంపీ నగేశ్ ప్రచారం చేయగా ఉట్నూర్ మండలం చెరువుగూడలో మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తలమడుగు మండలం దేవాపూర్‌లో ప్రచారానికి వచ్చిన నాయకులు స్థానికులు మంగళహారతులు, డప్పుచప్పుళ్లతో ఘనస్వాగతం పలికారు.

తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో నిర్వహించిన ముదిరాజ్ మహాసభలో డిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన 200 మంది ముదిరాజ్ కులస్తులు, స్థానికులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాలాచారి మాట్లాడుతూ.. దేశంలోని 28 రాష్ర్టాల్లో లేని విధంగా తెలంగాణలో పేదల కోసం పలు సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. కులసంఘాలు ఉద్యమ సమయంలో కీలకపాత్ర పోషించాయని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో కులవృత్తులను ప్రోత్సహించేందుకు పలు సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతును రాజుగా చేసేందుకు రైతుబంధుతో పాటు ఇతర పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.1400 కోట్లతో కుప్టి ప్రాజెక్టు నిర్మాణం, హైడల్ విద్యుత్ తయారీ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో దళితబస్తీ పథకంలో భాగంగా 3 వేల ఎకరాల భూమిని పంపిణీ చేశామన్నారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, అమ్మఒడి, కేసీఆర్ కిట్ లాంటి పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడినట్లు తెలిపారు. మహాకూటమి అభ్యర్థులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న వేణుగోపాలాచారి టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం కులవృత్తులను గుర్తించి వారి ఉపాధి కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. గొల్ల, కుర్మలకు సబ్సిడీపై గొర్రెల పంపిణీ, మత్య్సకారులకు ఉచితంగా చేపల పిల్లల పంపిణీతో పాటు మార్కెటింగ్ కోసం వాహనాలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.

ఇంకా 20 సంవత్సారాలు సీఎంగా కేసీఆర్..
- మంత్రి జోగు రామన్న
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా 20 సంవత్సారాలు ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి జోగు రామన్న అన్నారు. పట్టణంలోని భుక్తాపూర్‌లో పలువురు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి కాంగ్రెస్, బీజేపీల నాయకులు, కార్యకర్తలు స్వచ్చందంగా టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఎన్ని వచ్చినా రాష్ట్రంలో కేసీఆర్‌ను ఓడించలేవన్నారు. ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర మంత్రులు ఒకవైపు తెలంగాణ పథకాలను మెచ్చుకుంటున్నారని.. కానీ స్థానిక బీజేపీ నాయకులకు మాత్రం అభివృద్ధి కనిపించక పోవడం సిగ్గుచేటన్నారు. ఒకవైపు మెచ్చుకుంటూ.. మరోవైపు విమర్శించడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు. ప్రజలు అభివృద్ధినే కోరుకుంటున్నారన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాలుగు సంవత్సరాలలో ప్రజలు కోరుకున్న పాలననే కేసీఆర్ అందించారన్నారు. మహా కూటమి నాయకులు చెప్పిన మాయ మాటలను నమ్మి ఓటేస్తే మరో ఐదేండ్లు రాష్ట్రం అధోగతి పాలవుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం కుంటు పడుతుందన్నారు.

టీఆర్‌ఎస్ గెలుపు ఖాయం..
- ఎంపీ నగేశ్
క్షేత్ర స్థాయి సమస్యలపై అవగాహన ఉన్న మేధావి సీఎం కేసీఆర్ అద్భుత పథకాలతో టీఆర్‌ఎస్ సర్కారు అన్ని వర్గాలకు బంధువైపోయిందని ఆదిలాబాద్ ఎంపీ జి.నగేష్ అభివర్ణించారు. మహామనిషి కేసీఆర్‌పై ప్రజలు పూర్తి నమ్మకంతో ఉన్నారని అందుకే ఇపుడు రాష్ట్రంలో వచ్చేది టీఆర్‌ఎస్ సర్కారేనని స్పష్టంచేశారు. ఎంపీ టీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి ఆదివారం తాంసి మండలం పొన్నారిలో ర్యాలీలో పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారం చేశారు. ప్రస్తుతం కుటుంబాలలో అమలవుతున్న పథకాలు తెలుసుకున్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఆస రా పించన్లు, రైతుబంధు, ఉచిత విద్యుత్తుతో తమ బతుకుల్లో మార్పు వచ్చిందని వారు ఆనందంగా ఎంపీతో చెప్పారు. తప్పకుండా కారు గుర్తుకే ఓటేస్తామని భరోసా ఇచ్చారు.

అనంతరం ఎంపీ నగేశ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ సారథ్యంలోని మహాకూటమి ఎంత అభాసుపాలవుతున్నదో ప్రజలంతా గమనిస్తూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సీఎం ప్రవేశపెట్టి సమర్థవంతంగా అ మలు చేయిస్తున్న అద్భుత పథకాలు దేశానికి, ప్ర పంచ దేశాలకు ఆదర్శంగా ఉన్నాయని గుర్తుచేశారు. ఉట్నూర్ మండలం చెర్వుగూడలో ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలతో టీఆర్‌ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని తెలిపారు.

283
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles