బోథ్‌కు చేరుకున్న ఎన్నికల సామగ్రి

Fri,November 16, 2018 11:16 PM

బోథ్, నమస్తే తెలంగాణ : నియోజకవర్గానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లతో పాటు వీవీపాట్లు బోథ్‌కు చేరుకున్నాయి. రెండు విడతలుగా గురువారం రాత్రి, శుక్రవారం ప్రత్యేక వాహనంలో భారీ బందోబస్తు మధ్య వీటిని తీసుకొచ్చారు. నియోజకవర్గం పరిధిలోని బోథ్, ఇచ్చోడ, నేరడిగొండ, బ జార్‌హత్నూర్, గుడిహత్నూర్, తలమడుగు, తాంసి, భీంపూర్, సిరికొండ మండలాల్లో 257 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి కోసం 296 ఈవీఎంలను ఇక్కడికి తీసుకొచ్చారు. వీటిలో 39 ఈవీఎంలను అత్యవసర వినియోగం కోసం అందుబాటులో ఉంచారు. వచ్చిన వాటిని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కృష్ణ ఆదిత్య సమక్షంలో స్ట్రాంగ్ రూం ఏర్పాటు చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవనంలో భద్ర పరిచారు. స్ట్రాంగ్ రూంకు తాళం వేసి సీల్ వేయించారు. కార్యక్రమంలో ఓఆర్‌వో మహేశ్వర్, తహసీల్దార్ ఇమ్రాన్‌ఖాన్, వివిధ పార్టీల నాయకులు ఉన్నారు.

భారీ బందోబస్తు..
ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూం తో పాటు కళాశాల చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నియోజకవర్గ నోడల్ అధికారి, డీఎస్‌పీ ఎల్‌సీ నాయక్ ఆధ్వర్యంలో ఎస్సై భీమయ్య, ఏఎస్సై లు, పోలీసు సిబ్బంది, సీఆర్‌పీఎఫ్ బలగాలను నియమించారు. కళాశాల చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. స్ట్రాంగ్ రూం వద్ద నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది.

356
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles