చెక్‌పోస్టుల వద్ద విధి నిర్వహణలో చురుగ్గా ఉండాలి


Fri,November 16, 2018 11:16 PM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ: పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. శుక్రవారం బేల మండలం కొబ్బాయి గ్రామ శివారు, జైనథ్ మండలం పిప్పర్‌వాడ టోల్‌ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల చెక్‌పోస్టులను ఎస్పీ విష్ణువారియర్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర సరిహద్దు నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని సూచించారు. మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రతి వాహనం నంబర్ రికార్డు చేసి తనిఖీలు నిర్వహించాలన్నారు. చెక్‌పోస్టుల్లో వసతి సౌకర్యాలు సమకూర్చుకోవాలని సూచించారు. అంతకు ముందు కొబ్బాయి గ్రామంలోని మరాఠా మీడియం మండల పరిషత్ పాఠశాలల్లోని, పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. చెక్‌పోస్టుల్లో నిఘా పెంచాలని, ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని సూచించారు. చెక్‌పోస్టుల్లోని రిజిష్టర్లను పరిశీలించారు.

అనంతరం ఎస్పీ విష్ణువారియర్ మాట్లాడుతూ సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అలర్ట్‌గా ఉండాలని సూచించారు. అక్రమ మద్యం, డబ్బు ఇతర రాష్ర్టాల నుంచి రవాణా కాకుండా వాహనాల తనిఖీలు చేపట్టాలన్నారు. మోడల్ కోడ్ నిబంధనలు పాటించాలన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అందరూ కృషి చేయాలన్నారు. సమాచార వ్యవస్థను పటిష్టపర్చడానికి మహారాష్ట్రలోని నాందేడ్, యావత్‌మాహల్, చంద్రాపూర్ జిల్లాల ఎస్పీలతో సమావేశాలు నిర్వహించామని చెప్పారు. అత్యవసర సమయంలో అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది మహారాష్ట్ర పోలీసుల సహకారం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మోడల్ కోడ్ అధికారులు, పోలీస్, ఇతర శాఖల సిబ్బంది ఉన్నారు.

278
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...