రాజీనామాల పర్వం..!


Fri,November 16, 2018 12:03 AM

-కాంగ్రెస్‌లో నిరసన జ్వాలలు
-పార్టీని వీడుతున్న సీనియర్లు, ఇతర నాయకులు
-బోథ్ అభ్యర్థి ఖారారుపై వీడని చిక్కుముడి
నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీలో కల్లోలం మొదలైంది. టికెట్ల కేటాయింపుతో హస్తం పార్టీలో రాజీనామాల పర్వం మొదలైంది. ముథోల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పవార్ రామారావు పటేల్‌ను ప్రకటించడంతో.. మాజీ ఎమ్మెల్యే బోంస్లే నారాయణరావు పటేల్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మోహన్‌రావు పటేల్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. వారితో పాటు ఆయ న వర్గీయులంతా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యకర్తల సమావేశం నిర్వహించి.. ఈ నిర్ణయం తీసుకున్నారు. నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నుంచి పోటీ చేయాలని నిర్ణయించగా.. కండువాలు కూడా కప్పుకున్నారు. గడియారం గుర్తుపై పోటీ చేస్తామని.. రెండు రోజుల్లో నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో ఇక్కడ బంధువుల మధ్య పోటీ తప్పేలా లేదు. ఖానాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా రాథోడ్ రమేశ్‌ను ప్రకటించడంతో.. ఇదే స్థానాన్ని ఆశించిన హరినాయ క్ తీవ్ర నిరాశకు గురయ్యారు. రాథోడ్ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. గురువారం తన వర్గీయులతో కలిసి ఖానాపూర్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. రెబల్ అభ్యర్థిగా బరిలో దిగాలని భావిస్తుండగా.. భవిష్యత్తు కార్యాచరణను శుక్రవారం ప్రకటిస్తామని అంటున్నారు. రాథోడ్ అభ్యర్థిత్వం మార్చాలని.. తనకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా రు. లేనిపక్షంలో పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు.

బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది చిక్కుముడి వీడడం లేదు. తొలి, మలి జాబితాలో బోథ్ అభ్యర్థి ఖరారును పెండింగ్‌లో పెట్టగా.. తా జాగా మూడో జాబితా విడుదల చేయనున్నారు. ఇం దులోనూ బోథ్ అభ్యర్థి ఎవరనేది వెల్లడయ్యే అవకాశాలు లేవు. సోయం బాపురావు కోసం రేవంత్‌రెడ్డి పట్టుబడుతుండగా.. అనిల్ జాదవ్‌కు ఇవ్వాలని డీసీ సీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి గట్టిగా కోరుతున్నారు. దీంతో బోథ్ టికెట్‌పై స్పష్టత రావడం లేదు. టికెట్ కోసం ఇరువర్గాలు ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరికి టికెట్ వస్తే మరొకరు సహకరించే పరిస్థితి లేకపోగా... ఒకరు రెబల్‌గా బరిలో దిగే అవకాశం ఉంది. ఆదిలాబాద్‌లోనూ గండ్రత్ సుజాతకు వ్యతిరేకంగా మాజీ మంత్రి సి.రామచంద్రారెడ్డి, భార్గవ్ దేశ్‌పాండే వర్గీయులు సమావేశం ఏర్పాటు చేయగా.. భార్గవ్ దేశ్‌పాండే హాజరయ్యారు. విష యం తెలిసి ఈ సమావేశానికి వచ్చి గండ్రత్ సుజాత సముదాయించిన... వారు సహకరించే పరిస్థితి కన్పించడం లేదు. బెల్లంపల్లిలో సీపీఐకి ఇవ్వడంపై కాంగ్రెస్ నేత చిలుముల శంకర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన కూడా తన భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెట్టారు. మంచిర్యాలలో ప్రేంసాగర్‌రావుకు టికెట్ రావడంతో గడ్డం అరవింద్‌రెడ్డి పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. నేడో, రేపో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరనున్నట్లు తెలిసింది.

సిర్పూర్(టి) నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి హరిబాబును ప్రకటించడంతో.. టికెట్ ఆశించిన నియోజకవర్గ ఇన్‌చార్జి రావి శ్రీనివాస్ పార్టీ ని వీడారు. ఆయనతో పాటు జిల్లా పార్టీ కార్యదర్శి నయిర్ అలీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు షబ్బీర్ ఆహ్మద్‌తో ఇతర ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేశారు. ఈనెల 17న కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు రావి శ్రీనివాస్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థికి ఇక్కడ రెబల్ బెడద తప్పేలా లేదు. చెన్నూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నుంచి బి.వెంకటేశ్ నేతకు టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ.. సీనియర్ నాయకులంతా రాజీనామా బాట పట్టారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నారు. దుర్గం అశోక్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత, నియోజక వర్గ కో-ఆర్డినేటర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేగల్ల విజయ్‌తో పాటు 300 మంది కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. మరోవైపు మాజీ మంత్రి బోడ జనార్ధన్ తన భవిష్యత్ కార్యాచరణపై దృష్టిపెట్టారు.

321
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...