అండగా నిలవండి.. అభివృద్ధి చేస్తా

Fri,November 16, 2018 12:01 AM

బేల : పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని, ప్రజలు అండగా నిలబడి ఆశీర్వదించాలని మంత్రి జోగురామన్న అన్నారు. బేల మండలంలోని తోయగూడ, కార, పలై తండా, దౌన, మారుతి గూడ, సాంగ్వి, సైద్‌పూర్ తదితర గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో మంత్రి జోగురామన్నకు మహిళలు మంగళహారతులిచ్చి బొట్టుపెట్టి స్వాగతం పలికారు. ర్యాలీ, డప్పు చప్పుళ్ల మధ్య ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాలు గులాబీమయంగా మారాయి. ఈ సందర్భంగా మంత్రి జోగురామన్న మాట్లాడుతూ.... ప్రతి పక్షాలు అధికారం కోసం పార్టీ సిద్దాంతాలను తుంగలో తొక్కి అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. నాలుగున్నర ఏళ్లలో అభివృద్ధి సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. కేసీఆర్‌ను ఓడించే పార్టీకాని, నాయకుడు కాని లేరన్నారు. అందుకే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీతో జత కట్టిందని, వీటితో పాటు తెలంగాణ జన సమితి, సీపీఐలు ఒకటయ్యాయన్నారు. సీట్లు కూడా సర్దుబాటు చేయలేని కూటమికి ప్రభుత్వాన్ని నడిపే నాయకుడు లేరన్నారు. 68 ఏళ్లు రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ప్రజలకు ఏం చేశాయో చెప్పాలని ప్రశ్నించారు.

అన్ని వర్గాలకు పెద్దపీట..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాలకు పెద్దపీట వేసిందని మంత్రి జోగురామన్న అన్నారు. యాదవులకు సబ్సిడీపై గొర్రెలు, రైతులకు సబ్సిడీపై పాడి గేదెలు, మత్స్యకారులకు ఉచితంగా చేపల పంపిణీ, కుల సంఘాల భవనాల నిర్మాణం ఇలా అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేసిందన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేశారన్నారు.

అన్నదాతకు అండగా..
గతంలో కాంగ్రెస్, టీడీపీ పాలకులు కరెంటు అడిగిన ప్రజలపై కాల్పులు జరిపి గుర్రాలతో తొక్కించారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులు అడగకుండానే 24గంటలపాటు ఉచిత కరెంటు అందించిందన్నారు. చనాక-కోర్ట బ్యారేజీ నిర్మాణ పనులతో లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు.

పాక్షిక మ్యానిఫెస్టోకు ఆదరణ..
సీఎం కేసీఆర్ ప్రకటించిన పాక్షిక మ్యానిఫెస్టోకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. రైతుబంధు, ఆసరా పెన్షన్లు, నిరుద్యోగ భృతి తదతర అంశాలను మ్యానిఫెస్టోలో ప్రకటించడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు తనకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రావుత్ మనోహర్, ఎంపీపీ కుంట రఘుకుల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, మాజీ సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు మస్కే తేజ్‌రావు, మండల అధ్యక్షుడు దేవన్న, ప్రధాన కార్యదర్శి ప్రమోద్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు జక్కుల మధుకర్, నాయకులు సంతోష్ బెదుల్కర్, మంగేశ్ ఠాక్రే, జితేందర్, ప్రకాశ్ పవార్, సతీశ్, ఎంపీటీసీలు గెడం మనోజ్, అరుణ్, మహ్మద్, తన్వీర్‌ఖాన్, కో ఆప్షన్ సభ్యుడు తన్వీర్ ఖాన్, చందర్ షౌ, సురేశ్, ఎంపీటీసీ దత్తు, జైనథ్, బేల మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు సుదాం రెడ్డి, వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.

315
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles