ఒకటి తేలింది.. మరొకటి ఆగింది..

Wed,November 14, 2018 11:46 PM

- కాంగ్రెస్‌లో రేవంత్ వర్సెస్ ఏలేటి
- రెండో విడతలో ఒక్కరికే స్థానం
- ఖానాపూర్ అభ్యర్థిగా రాథోడ్‌కే అవకాశం
- పెండింగ్‌లో మరో నియోజకవర్గం..
- బోథ్ అభ్యర్థిత్వంపై రేవంత్, ఏలేటి పట్టు
- రాథోడ్‌కు వ్యతిరేకంగా నేడు సమావేశం
నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : కాం గ్రెస్ పార్టీలో అభ్యర్థుల ప్రకటన వాయిదాల పర్వాన్ని తలపిస్తోంది. రెండు నెలలుగా ఎదురుచూసిన ఆశావహులకు ఎట్టకేలకు సోమవారం తొలి జాబితా వెలువడిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో పది అసెంబీ నియోజకవర్గాలుండగా.. బెల్లంపల్లి స్థానాన్ని సీపీఐకి కేటాయించారు. మిగతా తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలని నిర్ణయించ గా.. తొలి జాబితాలో ఏడుగురు అభ్యర్థులను ప్రకటించి రెండు నియోజకవర్గాలు పెండింగ్‌లో పెట్టారు. గిరిజన నియోజకవర్గాలైన ఖానాపూర్, బోథ్‌లో అ భ్యర్థుల విషయంలో వివాదం నెలకొనగా.. తొలి జా బితాలో ప్రకటించలేదు. తాజాగా బుధవారం రోజున రెండో జాబితా వెల్లడించినా.. అందులోనూ ఖానాపూర్ నియోజకవర్గానికి మాత్రమే అభ్యర్థిని ప్రకటించారు. బోథ్ నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించకుండా.. మరోసారి పెండింగ్‌లో పెట్టారు. మూడో జా బితాలో ఈ స్థానానికి అభ్యర్థిని ఖరారు చేస్తారనే చర్చ సాగుతోంది. ఖానాపూర్‌లో రాథోడ్ రమేశ్‌కు అవకా శం ఇవ్వగా.. ఆయన అభ్యర్థిత్వాన్ని గతంలో పోటీ చేసి ఓడిపోయిన అజ్మీరా హరినాయక్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే హరినాయక్ వర్గీయులు గాం ధీభవన్ ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దీంతో కొందరు అస్వస్థతకు గురి కావడంతో స్లైన్లు కూడా ఎక్కించారు. తొలి జాబితాలో రాథోడ్ పేరు లే కుండా తాత్కాలికంగా ఆపేసి.. రాథోడ్‌కు టికెట్ కేటాయించలేదని చెప్పి నమ్మించారు.

రాథోడ్ రమేశ్, హరినాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని, తప్పకుం డా న్యాయం చేస్తామని అధినాయకులు స్పష్టం చేయడంతో.. హరినాయక్ వర్గీయులు దీక్ష విరమించారు. తొలి జాబితాలో రాథోడ్ పేరు లేకపోవడంతో.. ఆనం ద పడిన హరినాయక్ వర్గీయుల ఆశలు అంతలోనే గల్లంతయ్యాయి. రెండు రోజులు కూడా గడవక ముందే రెండో జాబితాలో రాథోడ్ పేరు ప్రకటించడం తో.. హరినాయక్ తన భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెట్టారు. రాథోడ్ అభ్యర్థిత్వాన్ని సమ్మతించేది లేదని.. తనకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తన వర్గీయులతో గురువారం సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ, నిర్ణయం తీసుకోనున్నారు. రెబల్ అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. బోథ్ నియోజకవర్గానికి సంబంధించి.. సోయం బాపురావు, అనిల్ జాదవ్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. సోయం బాపురావు గతంలో టీడీపీలో ఉండ గా.. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తో పాటు కాంగ్రెస్‌లో చేరారు. ఆయన వర్గీయుడిగా ఉన్న సోయం టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా రు. ఆయనకు రేవంత్‌రెడ్డి ఆశీస్సులు ఉండగా.. తన వర్గీయుడైన సోయం బాపురావుకే ఇవ్వాలని రేవంత్‌రెడ్డి పట్టుబడుతున్నట్లు తెలిసింది. గతంలో పోటీ చేసి ఓడిపోయిన అనిల్ జాదవ్ ఈ సారి కూడా తనకే అవకాశం ఇవ్వాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.

డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సొంత నియోజక వ ర్గం కావడం, అనిల్ జాదవ్ ఆయన వర్గంలో ఉండడంతో.. ఈ స్థానాన్ని అనిల్ జాదవ్‌కే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇప్పటికే తొలి విడత టికెట్ల కేటాయింపులో తన మాటకు ప్రాధాన్యత దక్కలేదనే అసంతృప్తితో ఉన్న ఏలేటి.. ఎలాగైనా బోథ్ టికెట్‌ను అనిల్ జాదవ్‌కు ఇవ్వాలని గట్టిగా కోరుతున్నట్లు తెలిసింది. మరోవైపు ఖానాపూర్‌లో రాథోడ్‌కు వ్యతిరేకంగా పా వులు కదిపిన డీసీసీ అధ్యక్షుడు.. అధిష్ఠానం చివరికి డీసీసీ మాటను కాదని రాథోడ్‌వైపే మొగ్గు చూపింది. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం తన సొంత నియోజకవర్గంలో అయినా.. తన వర్గీయుడైన అనిల్ జాదవ్‌కు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దీంతో బోథ్ స్థానంపై సోయం బాపురావు, అనిల్ జాదవ్ మధ్య ఎంత పోటీ ఉందో.. అంతకుమించి టీపీసీసీ కార్యనిర్వాహ క అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మ హేశ్వర్‌రెడ్డి మధ్య గట్టి పోటీ నడుస్తున్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది. ఇక్కడ సోయం, జాదవ్‌లో ఎవరి కి టికెట్ వచ్చినా.. మరొకరు సహకరించే పరిస్థితి లేదు. దీంతో ఒకరు తప్పనిసరిగా రెబల్ అభ్యర్థిగా బరిలో దిగాలని భావిస్తున్నారు. ఆదిలాబాద్, సిర్పూర్(టి), మంచిర్యాల, చెన్నూర్, ముథోల్, బెల్లంపల్లి లో టికెట్లు రాని వారు.. రెబల్‌గానీ, ఏదైనా జాతీయ పార్టీ నుంచి టికెట్ తీసుకొని ఆ గుర్తుపై పోటీ చేయాలని భావిస్తున్నారు. దీంతో అభ్యర్థులతో పాటు కాం గ్రెస్‌కు కొత్త తలనొప్పి మొదలైంది.

365
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles