కుప్టి బస్‌స్టాప్ వద్ద రోడ్డు ప్రమాదం

Wed,November 14, 2018 11:45 PM

నేరడిగొండ : మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై ఉన్న కుప్టి బస్‌స్టాప్ వద్ద ఆగి ఉన్న మ్యాక్స్ వాహనాన్ని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోథ్ నుంచి ఇచ్చోడ వెళ్తున్న మ్యాక్స్ వాహనాన్ని హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొంది. దీంతో మ్యాక్స్ వాహనంలో ప్రయాణిస్తున్న తొమ్మిది మందికి గాయాలయ్యాయి. అందులో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, నలుగురికి స్వల్ప గాయాలైనట్లు తెలిపారు. మ్యాక్స్ వాహనంలో 11 మంది ప్రయాణిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. అందులో తీవ్ర గాయాలైన వారు అనుకుంట లక్ష్మి, శివరాత్రి ఎల్లుబాయి, పోసాని(బజార్‌హత్నూర్), కుతిలీబేగం (ఇచ్చోడ), నూర్జాహాన్ బేగం (బోథ్) కాగా కొక్కుల కస్తూరి, చిన్నపాప, శారద (బోథ్),అనుముల ప్రవీణ్(నిర్మల్)లకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గమనించి 108 అంబులెన్స్‌లో ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు నేరడిగొండ ఎస్సై హరిశేఖర్ తెలిపారు.

325
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles