ఎన్నికలకు ప్రశాంత వాతావరణం కల్పించాలి


Wed,November 14, 2018 12:41 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : ఎన్నికలకు ప్ర శాంత వాతావరణం కల్పించాలని డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డి సూచించారు. మంగళవారం జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. అన్ని జిల్లాల్లో ప్రశాంత వాతావరణం కల్పించడానికి భారీ పోలీసు బలగాలను పంపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. శాంతి భద్రతలను అదుపులో ఉం చేలా ప్రతి పోలీసు అధికారి అన్ని గ్రామాలను సందర్శించి పరిస్థితులను అవగతం చేసుకోవాలన్నారు. సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేసుకొని స్థానిక సమాచార వ్యవస్థను మరింత పటిష్టం చేసుకోవాలని సూచించారు. మారుమూల గ్రామాలకు వెళ్లే పార్టీ అభ్యర్థులు ముందస్తుగా తెలియజేసి భద్రత ఏర్పాట్లను చూ సుకోవాలన్నారు. నగదు, మద్యం సరఫరా కాకుండా నిరంతరం వాహనాలు తనిఖీ చేపట్టి అడ్డుకోవాలని సూచించా రు. అనంతరం ఎస్పీ విష్ణు వారియర్ మాట్లాడుతూ.. నేర చరిత్ర ఉన్న 1200 మందిని ఇప్పటికే బైండోవర్ చేశామని తెలిపారు. ఇందులో గత ఎన్నికలలో గొడవలు చేసి కేసులు నమోదైన వ్యక్తులు ఉన్నారని వివరించారు. ఎన్నికలపై ప్రజ ల వద్ద ఎలాంటి సమాచారం ఉన్న తెలిపేందుకు పోలీస్ కం ట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

నేరుగా 08732 - 226246 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని, ఎన్నికలను సజావుగా నిర్వహించేలా ఇప్పటికే రూ.పది కోట్ల 50లక్షల నగదు, రూ.4లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించే విధంగా అవగాహన సదస్సు లు ఏర్పాటు చేసి వివరించినట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై కసరత్తు పూర్తి చేసి నివేదిక పంపుతామని చెప్పారు. జిల్లాలో బందోబస్తు కోసం అదనంగా కేంద్ర బలగాలు అవసరం అని తెలిపారు. జిల్లాకు మూడు వైపు లా మహారాష్ట్ర సరిహద్దు ఉండడంతో మహారాష్ట్ర ఉన్నతాధికారులతో పలు దఫాలు సమావేశాలు ఏర్పాటు చేసి పరస్పర సమాచార వ్యవస్థను పటిష్టపరుచుకున్నామని చెప్పా రు. వీసీలో అదనపు ఎస్పీలు సాదుమోహన్‌రెడ్డి, కంచమోహన్, స్పెషల్ బ్రాంచ్ సీఐ వెంకన్న, ఎస్సైలు అన్వర్ ఉల్‌హక్, ప్రభాకర్, అశోక్ కుమార్ వశిష్ట, డీసీఆర్బీ సీఐ పురుషోత్తం చారి, ఆర్‌ఐలు వి.వామనమూర్తి, ఓ.సుధాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

314
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...