ఊపందుకున్న ప్రచారం


Mon,November 12, 2018 11:44 PM

ఆదిలాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలో టీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రచారం విస్తృతంగా కొనసాగుతోంది. 63 రోజులుగా ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో ఓ విడత ప్రచారాన్ని పూర్తి చేసిన అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు ప్రచారాన్ని మరింత ము మ్మరం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి బీ ఫాం లు అందుతున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులు సోమవారం జిల్లాలో ప్రచారం కొనసాగించారు. ఆదిలాబాద్ పట్టణంలోని దుర్గానగర్, దస్నాపూర్ ప్రాంతాల్లో మంత్రి జోగు రామన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మ హాకూటమిలో అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ నేత లు చంద్రబాబు చుట్టూ తిరుగడం సిగ్గుచేటని ఢిల్లీ, అ మరావతి పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో పుట్టిన టీఆర్‌ఎస్‌కు రోజురోజుకూ ప్రజల ఆదరణ పెరుగుతోందని తెలిపారు. సీమాంధ్ర పాలకు లు అరవై ఏళ్లలో చేయని అభివృద్ధిని టీఆర్‌ఎస్ నాలుగేళ్లలో చేసిందన్నారు. విదేశాల నుంచి నల్లధనాన్ని రప్పించి పేదల ఖాతాల్లో వేస్తామని చెప్పిన ప్రధాని నరేంద్రమోడీ ప్రజలను మోసం చేశారని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబస్తీ, అమ్మఒడి, కేసీఆర్‌కిట్‌తో పాటు ఇతర పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వంద సీట్లు సా ధించి అధికారంలోకి వస్తుందన్నారు. దుర్గానగర్, ద స్నాపూర్, భుక్తాపూర్‌కు చెందిన 300 మంది ఇతర పా ర్టీల కార్యకర్తలు, స్థానికులు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు నేరడిగొండ, బోథ్, గుడిహత్నూర్ మండలాల్లో ప్రచారం చేశారు. మహాకూటమి ఓ మాయాకూటమిగా మారిందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు అందరికీ ప్రయోజనం చేకూర్చాయని, దేశంలో ఎక్కడా లేని అ భివృద్ధి తెలంగాణలో జరిగిందని తెలిపారు. అభివృద్ధి చేసిన పార్టీని ప్రజలు గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రచారానికి వచ్చే ప్రతిపక్షాల నాయకులను గతంలో వారు చేసిన అభివృద్ధిపై ప్రజల నిలదీయాలని కోరారు.

327
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...