కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యం


Tue,September 18, 2018 11:40 PM

ఇంద్రవెల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మంగళవారం మండలకేంద్రంలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ముందుగా కార్యాలయం ఎదుట పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఏరాష్ట్రంలో అమలు చేయని విధంగా రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేసి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. ఉట్నూర్‌లో వంద పడకల దవాఖాన ఏర్పాటు చేసి గిరిజనులకు మెరగైన విద్యసేవలు అందుబాటలోకి తెచ్చిందన్నారు. వికలంగులతోపాటు విత్తంతు, ఒంటరి మహిళలు, వృద్ధులకు పింఛన్లు అందిస్తాందన్నారు. 60 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి కేవలం నాలుగు సంవత్సరాల్లోనే చేసిందన్నారు. రాబోయో ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించి ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.

185
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...