జాగృతిని బలోపేతం చేయాలి

Tue,September 18, 2018 11:40 PM

తెలంగాణచౌక్ : ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ జాగృతి సంస్థను బలోపేతం చేయాలని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత సూచించినట్లు జాగృతి జిల్లా అధ్యక్షుడు రంగినేని శ్రీనివాస్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని మాదాపూర్ ఎస్ కన్వెన్షన్ హాలులో నిర్వహించిన తెలంగాణ జాగృతి రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలోని 31 జిల్లాల అధ్యక్షులతో జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత సమావేశమయ్యారన్నారు. జాగృతి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారని తెలిపారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు గొప్పవని.. ప్రపంచ నలుమూలలకు చాటి చెప్పిన ఘనత జాగృతికే దక్కుతోందన్నారు. సామాజిక కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కవిత జిల్లాలో జాగృతి తరఫున జరుగుతున్న కార్యక్రమాలను ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు.

192
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles