శాంతియుతంగా జరుపుకోవాలి


Tue,September 18, 2018 11:39 PM

ఇచ్చోడ : గణేశ్ నిమజ్జన శోభాయాత్రను మండపాల ని ర్వాహకులు, అన్ని వర్గాల ప్రజలు శాంతియుత, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఉట్నూర్ డీఎస్పీ ఎన్. వెంకటేశ్ అన్నారు. మంగళవారం స్థానిక విఠల్‌రెడ్డి ఫంక్షన్ హాల్‌లో గణేశ్ నిమజ్జన ఉత్సవాలపై గణేశ్ మండపాల ని ర్వాహకులు, ఇచ్చోడ పట్టణ వాసులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడారు. ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ నియమ, నిబంధనల ను పాటించాలన్నారు. డీజేలకు అనుమతులు లేవని, అధికారులు సూచించిన సమయంలోనే నిమజ్జనాన్ని పూర్తి చే యాలన్నారు. నిమజ్జనం సందర్భంగా అన్ని వర్గాల వారు పోలీసులకు సహకరించాలని కోరారు. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పోలీసులు, అధికారులకు సమాచారం అం దించాలని, ఎవరు కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదన్నారు. నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, కన్నుల పండుగగా, వైభవంగా, శోభాయమానంగా నిర్వహించువాలని ఆయన వివరించారు. తహసీల్దార్ మహేంద్రనాథ్, ఎస్సై జీ. పుల్లయ్య, నాయబ్ తహసీల్దార్ జాదవ్ రామారావు, ఎక్సైజ్ సీఐ రాజామౌళి, ట్రాన్స్‌కో ఏఈ మనోహర్, ఈవో ఖలీమ్, యువకులు తదితరులు పాల్గొన్నారు.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...