పీఆర్టీయూతోనే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం


Tue,September 18, 2018 11:39 PM

తానూర్ : దీర్ఘకాలికంగా ఉపాధ్యాయు లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం పీఆర్టీయూతోనే సాధ్యమవుతుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బీవీ రమణారా వు అన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన మం డల సర్వసభ్య సమావేశంలో పాల్గొని మా ట్లాడారు. 30 ఏళ్లుగా అనేక సమస్యలను జీవోల రూపంలో సాధించిన ఘనత తమ సంఘానిదేనన్నారు. పంచాయతీరాజ్ ఉ పాధ్యాయులకు జీహెచ్‌ఎం, ఎంఈవో, డి ప్యూటీ డీఈవో, జేఎల్, డీఈఈటీ ఉద్యోగోన్నతులను ఇప్పించడంలో సంఘం కీలక పాత్ర ఉందన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులపై మరో మారు సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ కేసు సంఘం తరఫున వేస్తూ ప్రభు త్వం తరపున కూడా కేసు వేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దుకు ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేశామన్నారు. 12 ఏళ్లుగా మండలంలో పని చేసి బదిలీపై వెళ్లిన శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నరేంద్రబాబు, ఎంఈవో సుభాష్, పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లన్న, రాష్ట్ర కార్యదర్శి రాజేందర్, జిల్లా కార్యదర్శి నర్సింలు, మండల అధ్యక్షుడు గంగుల చిన్నన్న, అసోసియేషన్ అధ్యక్షుడు జబ్బర్ తదితరులు పాల్గొన్నారు.

మండలాధ్యక్షుడిగా చిన్నన్న..
పీఆర్టీయూ మండల అధ్యక్షుడిగా భోసి గ్రామానికి చెందిన గంగుల చిన్నన్నను ఎన్నుకున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బీవీ రమణారావు, ప్రధాన కార్యదర్శి నరేంద్రబాబు తెలిపారు. మండలంలో పీఆర్టీ యూ బలోపేతానికి కృషి చేస్తానని చిన్నన్న అన్నారు. అనంతరం గంగుల చిన్నన్నను మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

118
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...