చికిత్స పొందుతూ కూలీ మృతి


Tue,September 18, 2018 11:39 PM

భీంపూర్ : చేనులో పంటకు క్రిమి సంహారక మందు స్ప్రే చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోక అనారోగ్యానికి గురైన ఒక వ్యవసాయ కూలీ చికిత్స పొందుతూ మృతి చెంది న సంఘటన భీంపూర్ మండలంలో చోటుచేసుకున్నది. పోలీస్ స్టేషన్ రైటర్ సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వడూర్‌కు చెందిన భవానీ కిషన్(28) ఈనెల 4న వడూర్‌లో ఒక రైతుచేనులో పంటకు క్రిమి సంహారక మందు పిచికారీ చేయడానికి వెళ్లాడు. గాలి వీస్తున్న వైపు ఎదురుగా పిచికారీ చేయడం, చేతులకు, ముక్కుకు గ్లౌజ్ వాడకపోవడం, కళ్లద్దాలు లేకపోవడంతో అస్వస్థతకు గురయ్యాడు. తెల్లవారుజామున వాంతులతో బాధపడుతుండగా రైతు, కుటుంబీకులు ఆదిలాబాద్ రిమ్స్‌లో చేర్చారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఏఎస్సై లక్ష్మీనారాయణ పంచనామా చేసి కేసు దర్యాప్తు చే స్తున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని ఈ కుటుంబం దీనావస్థకు గ్రా మస్తులు విచారం వ్యక్తం జేశారు. ఈ విషాద ఉదంతంపై తాంసి, భీంపూర్ మండలాల మత్స్యకార సంఘాలు తమ ఆవేదన వ్యక్తం జేశాయి. ఈ విషయం ఎమ్మెల్యే అభ్యర్థి రాథోడ్ బాపురావు, ఎంపీ జి. నగేశ్, కలెక్టర్‌కు విన్నవించి బాధిత కుటుంబాన్ని ఆదుకునేలా చూస్తామని టీఆర్‌ఎస్ మండల కన్వీనర్ సంజీవ్‌రెడ్డి తెలిపారు. కిషన్‌కు భార్య, తల్లి ఉన్నారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...