వంద శాతం ఉత్తీర్ణత సాధించండి


Mon,September 17, 2018 11:40 PM

గుడి హత్నూర్: ఇష్టపడి చదివితే వంద శాతం ఉత్తీర్ణత సాధించడం కష్టమేమీ కాదనిజిల్లా విద్యాశాఖాధికారి ఏ.రవీందర్‌రెడ్డి అన్నారు. గుడిహత్నూర్ మండలం మన్నూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో అంగ్ల బోధన తరగతులను సోమవారం డీఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి గదికి వెళ్లి డిజిటల్ పాఠాలను పరిశీలించారు. ఆంగ్ల విషయంపై విద్యార్థుల సామర్థ్యాన్ని ప్రశ్నల ద్వారా తెలుసుకున్నారు. మంచి స్పందన రావడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ.. లక్ష్యంతో చదివితే అనుకున్న గమ్యానికి చేరుకుంటామన్నారు. పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి గ్రామానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు పరిస్థితిని పరిశీలించారు. డీఈవో వెంట ఎంఈవో ఆర్.నారాయణ, ఏఎస్‌వో శ్రీహరిబాబు, సీసీ రాజేశ్వర్, ఉపాధ్యాయులు ఉన్నారు.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...