గుడుంబా పట్టివేత


Mon,September 17, 2018 11:39 PM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ: నిషేధిత గుడుంబాను తరలిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు దాడిచేసి వాహనాన్ని సీజ్ చేశారు. ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ మండలం దైగూడ గ్రామం నుంచి టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై 10 లీటర్ల గుడుంబాను లోహర గ్రామానికి తరలిస్తున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. ఈ మేరకు సిబ్బందితో కలిసి మాటు వేసి పట్టుకున్నామని తెలిపారు. లోకారి గ్రామానికి చెందిన అరుగుల అశోక్, లోహార గ్రామానికి చెందిన కామ్లే విజయ్ వాహనాన్ని వదిలి పారిపోయారన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. వంద రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో భాగంగా నేరాల నియంత్రణకు ఎక్సైజ్ పోలీసులు కృషి చేస్తున్నారన్నారు. దేశీదారు, గడుంబా, నల్ల బెల్లం, నిషేధిత పదార్థాలపై నిఘా కొనసాగుతుందని తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దు గుండా దేశీదారు అక్రమ రవాణా కాకుండా నది తీరాన పెట్రోలింగ్ కొనసాగుతుందని చెప్పారు. రాత్రి వేళల్లో పట్టణ కేంద్రాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేస్తున్నట్లు తెలిపారు. దాడిలో ఎస్సైలు సంజీవ్, అరుణ్, నానక్‌సింగ్, గిరి, సిబ్బంది సీహెచ్ శ్రీనివాస్ ఉన్నారు.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...