చేరికల జోరు.. ప్రచార హోరు..

Sun,September 16, 2018 12:43 AM

ఆదిలాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూ సుకుపోతున్నారు. మంత్రి జోగు రామన్న శనివారం ఉదయం ఆదిలాబాద్ పట్టణంలోని కొత్త కుమ్మరి వాడ, విద్యానగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించా రు. కుమ్మరివాడలో స్థానికులతో సమావేశమైన మంత్రి కులవృత్తులను ప్రోత్సహించేందుకు ప్రభు త్వం పలు పథకాలను అమలు చేస్తోందని తెలిపా రు. వారి ఉపాధిని మెరుగుపర్చుకొనేందుకు రుణా లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. విద్యానగర్‌లో మంత్రి జోగు రామన్న సమక్షంలో 150 మంది రిటై ర్డు, ఉద్యోగులు, యువకులు, మహిళలు టీఆర్ ఎస్‌లో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బేల మండలం కేంద్రంలో ప్రచారానికి వెళ్లిన మంత్రి జోగు రామన్నకు స్థానికులు ఘన స్వాగతం పలికా రు. దాదాపు వేయికిపైగా మోటార్‌సైకిళ్లతో నాయకు లు, కార్యకర్తలు, ప్రజలు మంత్రికి స్వాగతం పలి కారు. కిలోమీటర్ల మేర మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వ హించారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో పలు వురు స్థానికులు మాట్లాడారు. బేల మండలాన్ని మంత్రి జోగు రామన్న గతంలో ఎన్నడూ లేని విధం గా అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని ఈ ఎన్నికల్లో తాము టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తామని తెలిపారు.

కాంగ్రెస్ నాయకులను నీలదీయండి..
ఎన్నికల ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ నాయ కులు అధికారంలో ఉండగా ఏ చేశారో స్థానికులు నిలదీయాలని మంత్రి జోగు రామన్న కోరారు. కాం గ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పదేండ్లలో రాష్ర్టాన్ని నాశనం చేసి, ఇప్పుడు తమకు అధికారం ఇవ్వాలని ప్రజల ముందుకు వస్తున్నారన్నారు. కనీస అవసరా లైన తాగునీరు, విద్య, వైద్యసేవలు కూడా అందిం చని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటెయ్యాలో ప్రశ్నిం చాలన్నారు. రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజల కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద లకే కాకుండా ఓసీ వర్గంలోని పేద పిల్లలకు కూడా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నామన్నారు. ఇతర రాష్ర్టాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు తెలంగాణ అభివృద్ధిని మెచ్చుకుంటున్నారని, సంక్షే మ పథకాల అమలులో మన రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు.
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు నేరడిగొండ నుంచి ఇచ్చోడ వరకు 300 మోటార్‌సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. నేరడిగొండ, ఇచ్చోడ మండల కేం ద్రాల్లో నాయకులు, కార్యకర్తలు, స్థానికులు ఆయ నకు ఘన స్వాగతం పలికారు. టీఆర్‌ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయని తె లిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ లో వివిధ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్న దని పేర్కొన్నారు.

263
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles