బ్రహ్మరథం..

Wed,September 12, 2018 11:45 PM

ఆదిలాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలోని ఏ గ్రామంలో చూసినా స్థానికులు టీఆర్‌ఎస్ అభ్యర్ధులకు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రచారానికి పోతున్న అభ్యర్థులకు డప్పు చప్పుళ్లు, మంగళహారతులు, నృత్యాలు, పటాకులు కాలుస్తూ స్వాగతం పలుకుతున్నారు. జిల్లాలో పలు గ్రామాల్లో సందడి వాతావరణం కనపడుతోంది. అభివృద్ధిని కోరుకుంటున్నాం.. టీఆర్‌ఎస్ పార్టీకి అండగా ఉంటామంటూ తమ మద్దతు తెలుపుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం సంక్షే మ పథకాలను అమలు చేస్తున్నదని గ్రామస్తులు అంటున్నా రు. గతంలో ఎన్నడూ జరుగని అభివృద్ధి నాలుగేళ్లలో జరిగిందని పలు గ్రామాల ప్రజలు అంటున్నారు. తెలంగాణ ప్రభు త్వం ఏర్పడినప్పటి నుంచి గ్రామాలు అభివృద్ధి సాధించడంతో పాటు ప్రజలు వ్యక్తిగతంగా సైతం ప్రయోజనం పొందారని చె బుతున్నారు. జిల్లాలోని టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. బుధవారం మంత్రి జోగు రామన్న జైనథ్ మండలం పూసాయిలో జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొనగా.. బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బజార్‌హత్నూర్ మండలం బుర్కపల్లి, ఎస్సాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ప్రతిపక్షాలను నిలదీయండి : మంత్రి జోగురామన్న
ఎన్నికల ప్రచారానికి వచ్చే ప్రతిపక్షాల నాయకులను నిలదీయాలని మంత్రి జోగు రామన్న కోరారు. పూసాయిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభు త్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి వివిధ పథకాలను అమ లు చేస్తుందని తెలిపారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన కాంగ్రె స్ నాయకులు గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేశారని ప్రశ్నించాలని సూచించారు. పక్కనే ఉన్న మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉందని మన రాష్ట్రంలో రైతులు, ఇతర వర్గాల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను అక్కడ ఎందుకు అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే బురద లో వేసినట్లేనని సూచించారు. వర్షాలతో పంటలు నష్టపోయిన వారికి త్వరలో పరిహారం మంజూరవుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కారణంగా పంపిణీలో జాప్యం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలోని హైదరాబాద్ నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్, సిమెంటు ఫ్యాక్టరీ ఏర్పాటుతో జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. గ్రామానికి చెందిన పలువురు యువకులు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అమలు : బాపురావు
దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను టీఆర్ ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందని బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. బజార్‌హత్నూర్ మండలం బుర్కపల్లి, ఎస్సాపూర్ గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఎన్నికలు వస్తున్నందునా కాంగ్రెస్ నాయకులు గ్రా మాల్లోకి వస్తారని వారి మాటలు నమ్మవద్దని సూచించారు. రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు ఎక్కడా లేవని కల్యాణలక్ష్మి, కేసీఆర్‌కిట్, అమ్మఒడి, భూ పంపిణీ లాంటి పథకాల తో పేదలకు ప్రయోజనం చేకూరిందని తెలిపారు. పేద కుటుంబాల విద్యార్థులకు ప్రభుత్వం కార్పొరేట్ చదువులు అందిస్తుందని పేర్కొన్నారు.

309
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles