జిల్లాలో రైతులందరికీ వ్యవసాయ రుణ మాఫీ

Wed,September 12, 2018 11:41 PM

తెలంగాణచౌక్ : ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల తో జిల్లాలో రైతులందరికీ రుణమాఫీ వర్తించిందని రాష్ట్ర రైతు సమన్వయ సమితి జిల్లా కో-ఆర్డినేటర్ అడ్డి భోజారెడ్డి అన్నా రు. బుధవారం జిల్లా కేంద్రంలోని మంత్రి జోగు రామన్న ని వాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాంకు అధికారులు చేసిన తప్పిదంతో జిల్లాలో వివిధ బ్యాంకుల పరిధిలో కొం దరు మంది రైతులు రుణమాఫీకి నోచుకోలేదన్నారు. మంత్రి జోగు రామన్న, ఎంపీ గొడాం నగేశ్ కలిసి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి 608 రైతులకు రుణమాఫీ చేయించారన్నారు. రైతులకు సంబంధించిన రూ.3.64కోట్లు ప్రభుత్వం బ్యాం కులకు విడుదల చేసిందన్నారు. రుణమాఫీపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు రాద్దాంతం చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఫసల్ బీమా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.293కోట్లు ప్రభుత్వం చెల్లి స్తే.. ఇంకా కేంద్ర ప్రభుత్వం తన వాటా చెల్లించకపోవడంతో ఫసల్ బీమా పథకంలో పరిహారం ఆలస్యమవుతుందన్నారు.
బీజేపీ నాయకులు ప్రచారం కోసం గ్రామాల కు వస్తే రైతులు నిలదీయాలన్నారు. సమావేశం లో టీఆర్‌ఎస్ నాయకులు ఖయ్యూం రాజా, చాక టి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

రుణ మాఫీపై రైతుల హర్షం : సీఎం ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
తెలంగాణచౌక్ : బ్యాంకర్ల నిర్లక్ష్యంతో గతంలో రుణమాఫీకి నోచుకోని వారికి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రుణాలను మాఫీ చేయడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రాష్ట్ర మంత్రి జోగు రామన్న నివాసానికి వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి జోగు రామన్న ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. 2014లో కేసీఆర్ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక జిల్లాల వారీగా రైతుల వివరాలను సేకరించి అందరికీ రూ.లక్ష వరకు మాఫీ చేస్తున్నామని ఉత్వర్వులు జారీ చేశారు. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంతో కొందరు రైతులకు రుణమాఫీ వర్తించలేదు. రైతుల వివరాలను బ్యాంకర్లు ప్రభుత్వానికి పంపకపోవడంతో ఇన్నాళ్లూ రుణమాఫీకి నోచుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల ప్రజాప్రతినిధుల నుంచి ఇలాండి డిమాండ్లు రావడంతో సీఎం కేసీఆర్ మిగిలిన రైతులందరికీ రుణమాఫీని వర్తింపజేస్తామని గతంలో అసెంబ్లీలో ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూ.160 కోట్ల రుణాలను మాఫీ చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 24వేల మంది రైతులకు రుణమాఫీ వర్తింస్తుండగా.. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 400 మంది రైతుల రుణాలు మాఫీ కానున్నాయి. దీంతో రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి జోగు రామన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24గంటల ఉచిత కరెంటు సరఫరాతో బతుకులు బాగుపడ్డాయని, టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ మండలంలోని లోకారి, బూర్నూర్ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.


తలమడుగు మండలంలో..
తలమడుగు : గతంలో రుణమాఫీకి నోచుకోని అర్హులైన రైతులకు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తూ నిర్ణయం తీసుకొంది. దీంతో మండలంలోని మండలంలోని పల్లి-బీ, పల్లి-కే, లచ్చంపూర్ గ్రామాలకు చెందిన రైతులు 100మంది రైతులకు రూ.కోటి విలువైన రుణమాఫీ జరిగింది. బుధవారం పల్లి-కే గ్రామంలో రైతులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల కన్వీనర్ శ్రీనివాస్‌రెడ్డి, రైతులు చింతలపెల్లి లింగారెడ్డి, తొడసం పాండు, ఆత్రం రాందాస్, ఎల్టి రాంరెడ్డి, గంగం భూమారెడ్డి, గెడాం గోవింద్‌రావు తదితరులు పాల్గొన్నారు.

343
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles