బీసీల ఆర్థిక స్థాయి పెంచిన ప్రభుత్వం


Wed,September 12, 2018 11:39 PM

తెలంగాణ చౌక్ : బీసీ వర్గాల ఆర్థిక స్థాయిని పెంచిన ప్రభుత్వం తమదేనని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 100శాతం సబ్సిడీతో రూ.50వేల విలువైన చెక్కులను 309మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన బీసీలను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదన్నారు. రజక, వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, గంగపుత్ర, నాయీబ్రాహ్మణులు తదితర కులాల ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి పోయారన్నారు. వారి ఆర్థిక స్థాయిని పెంచేందుకు సీఎం కేసీఆర్ బడ్జెట్‌లో రూ.1478కోట్లు కేటాయించారన్నారు. 2.26లక్షల మందికి రుణాలు అందించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. మొదటి విడతగా జిల్లాలో 309 మందికి రూ.1.54కోట్ల విలువైన చెక్కులను అందిస్తున్నామన్నారు. ఎన్నికలు ముందుగా రావడం వల్ల కొంత ఆలస్యమైందని అక్టోబర్ 10లోగా రూ.లక్ష, రూ.2లక్షల యూనిట్లకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు కూడా చెక్కులను అందజేస్తామన్నారు. దరఖాస్తు చేసుకుని అర్హులై ఉన్న ప్రతి ఒక్కరికి రూ.50వేల లోన్ అందజేస్తామని ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. వచ్చిన డబ్బులు ఇతర ఖర్చులకు ఉపయోగించుకోకుండా ఉపాధి కోసం ఖర్చు చేసుకోవాలని సూచించారు.


అనంతరం డీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డి మాట్లాడుతూ.. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా జోగు రామన్న పని చేయడం జిల్లావాసుల అదృష్టమన్నారు. బీసీ కుల వృత్తులు చేసుకునే వారందరికీ ప్రభు త్వం ఆర్థికంగా ప్రోత్సాహం అందిస్తుందన్నారు. రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే బ్యాంకర్లు సరైన కాగితాలు లేవని తిప్పుకుంటున్నారన్నారు. వారి ఇబ్బందులను గమనించి సీఎం కేసీఆర్ బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారుకే చెక్కు ఇచ్చి ఇస్తున్నారన్నారు. బీసీలకు పెద్దపీట వేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అందరూ అండగా నిలబడాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీష, ఏఎంసీ చైర్మన్ ఆరె రాజన్న, ఆర్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ అడ్డి భోజారెడ్డి, ఐసీడీఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, జడ్పీటీసీ ఇజ్జిగిరి అశోక్, మంచికట్ల ఆశమ్మ, గంగారెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆశన్న, ఏవో భాగ్యలక్ష్మి, నాయకులు కాళ్ల విఠల్, పెందూర్ దేవన్న తదితరులు పాల్గొన్నారు.

303
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles