టీఆర్‌ఎస్ పార్టీకే మళ్లీ పట్టం కట్టాలి


Wed,September 12, 2018 11:38 PM

ఉట్నూర్, నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చి బంగారు తెలంగాణకు అడుగులు వేయాలని ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. బుధవారం స్థానిక స్టార్ ఫంక్ష న్ హాల్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఖరారైన సందర్భంగా కార్యకర్తలు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేఖానాయక్ మా ట్లాడుతూ.. అందరి సహకారంతో తాను ఎమ్మెల్యేగా గెలుపొందానన్నారు. తన పనితనాన్ని గుర్తించిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తిరిగి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారని తెలిపారు. టికెట్ రాలేదన్న అక్కసుతో కొం దరు తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారన్నారు. వారి లాగా లాబీయింగ్‌లు చేయడం తనకు అలవాటు లేదని, నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని చూసి అభ్యర్థిత్వం ఖరారు చేశారని, అధినేత కేసీఆర్‌కు రుణపడి ఉంటానన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కొనలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో పెట్టని సంక్షేమ పథకాలను సైతం ప్రజల కోసం రూపకల్పన చేసి అమలు చేసిందన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. ఈనెల 24న ఉట్నూ ర్ కేంద్రంగా పదివేల మందితో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అనంతరం రేఖానాయక్ సమక్షంలో లక్కారం గ్రామానికి చెందిన 30 మంది యువకులు, వెల్డర్ సంఘం బాధ్యులు పార్టీలో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్ విమల, జడ్పీటీసీ వాగ్మారే జగ్జీవన్‌రావు, వైస్ ఎంపీపీ సలీం, ఎంపీటీసీ కందుకూరి రమేశ్, ఆర్‌ఎస్‌ఎస్ మండల అధ్యక్షుడు అహ్మద్ అజీమొద్దీన్, నాయకులు పూజారి శివాజీ, దాసండ్ల ప్రభాకర్, లతీఫ్, ధరణి రాజేశ్, ముజీబ్‌ఖాన్, అన్సారి తదితరులు పాల్గొన్నారు.

242
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...