అభివృద్ధిని గుర్తించండి

Wed,September 12, 2018 11:38 PM

బజార్‌హత్నూర్ : దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హయాం లో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో గణనీయంగా వృద్ధి సాధించిందని బోథ్ ని యోజకవర్గ అభ్యర్థి రాథోడ్ బాపురావు అన్నారు. బుధవారం మండలంలోని బుర్కపల్లి, ఎస్సాపూర్ గ్రామంలో ప్రభు త్వం చేపట్టిన అభివృద్ధిని వివరిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అంతకుముందు గ్రామంలోని మహిళలు మం గళ హారతులతో ఎమ్మెల్యేకు ఘన స్వాగ తం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడా రు. గడిచిన నాలుగేళ్లలో నియోజకవర్గా న్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లానన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధిని ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ప్రజల కు బూటకపు మాటలు చెబుతూ పక్కతో వ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఎస్సాపూర్ గ్రామానికి వంతెన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయన్నారు. అం తకు ముందు గ్రామానికి ప్రచారం కోసం వచ్చిన మాజీ ఎమ్మెల్యేను కార్యకర్తలు, గ్రామస్తులు ఎడ్లబండి సహాయంతో వా గును దాటించారు.

కార్యక్రమంలో ఎం పీపీ సోం రాంరెడ్డి, బోథ్ మార్కెట్ కమి టీ చైర్మన్ రాసం దేవన్న, జిల్లా రైతుసమన్వయ సమితి సభ్యులు చిల్కూరి భూమ య్య, ఆత్మ చైర్మన్ మడిగే రమేశ్, ఎస్సీ,ఎస్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షు డు రాజారాం, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.అభివృద్ధి మరిచిన గత పాలకులు
జైనథ్ : భారత దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు దేశాన్ని సర్వనాశనం చేశాయని రాష్ట్ర మంత్రి జోగురామన్న అన్నారు. బుధవారం జైనథ్ మండలంలోని పూసాయి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా.. గ్రామస్తులు, యువకులు 200 మందికి పైగా టీఆర్‌ఎస్ పార్టీలో చేరడంతో వారికి టీఆర్‌ఎస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రికి గ్రామస్తులు భారీ ర్యాలీతో, డీజే చప్పుళ్ల నడుమ పటాకులు కాల్చి స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు ఆకర్షితులై గ్రామగ్రామాన యువకులు భారీ సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు.

రైతాంగాన్ని ఆదుకొనేందుకు గాను రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఎకరానికి రూ.4 వేల చొప్పున వారికి పెట్టుబడిని అందజేస్తున్నామన్నారు. కంటి వెలుగు పథకం ద్వారా గ్రామగ్రామాన కంటి వైద్య శిబిరాలు నిర్వహించి పేద వారికి కంటి చూపును ప్రసాదిస్తున్నామన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదింటి ఆడ పడుచుల పెళ్లిళ్లకు ప్రభుత్వం రూ.100116 కేసీఆర్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారన్నారు. ఆరోగ్యలక్ష్మి ద్వారా గ్రామంలోని మహిళలకు పౌష్ఠికాహారం అందిస్తుందన్నారు. అమ్మఒడి, కేసీఆర్ కిట్లను సైతం ప్రభుత్వం అందజేస్తుందన్నారు. బతుకమ్మ చీరలను తగలబెట్టిన ప్రతిపక్ష నాయకులు రైతు బంధు చెక్కులను ఎందుకు తగలబెట్టలేదని ఎద్దేవా చేశారు.

గత పాలకుల హయాంలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. స్వరాష్ట్రంలో 82వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసి అం దులో 42వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. యాపల్‌గూడ వద్ద సిమెంట్ ఫ్యాక్టరీతో పాటు మూతపడ్డ సీసీఐను సైతం తెరిపిస్తామన్నారు. కార్పొరేట్ స్థాయి లో విద్యను అందించేందుకు రాష్ట్రంలో 543 రెసిడెన్షియల్ పాఠశాలలను నెలకొల్పారన్నారు. కేజీ టూ పీజీలో భాగంగా ఆంగ్లమాధ్యమంలో విద్యను అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో సన్న బియ్యాన్ని అందిస్తున్నామన్నారు. పంట నష్టం కింద రూ.150కోట్లతో ప్రభుత్వానికి నివేదికను అందించామన్నారు. గాంధీ జయంతి అక్టోబర్ 2నుంచి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాల ద్వారా శుద్ధ జలాన్ని అందిస్తామన్నారు.

మంత్రికి అండగా ఉంటాం..
పూసాయి గ్రామానికి చెందిన రమేశ్ ఆధ్వర్యంలో బుధవా రం మంత్రి జోగురామన్న సమక్షంలో యువకులు, రజక సంఘం, గంగపుత్ర సంఘాల సభ్యులతో పాటు ఇతర యువకులు భారీ ఎత్తున టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పలువురు యువజన సంఘాల సభ్యులు మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా జోగు రామన్నను గెలిపించి టీఆర్‌ఎస్ పార్టీకి మద్దతుగా ఉంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆర్.మనోహర్, జిల్లా నాయకులు బాలూరి గోవర్ధన్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు అడ్డిభోజారెడ్డి, ఐసీడీఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, ఏఎంసీ చైర్మన్ లు ముక్కెర ప్రభాకర్, ఆరె రాజన్న, ఏఎంసీ మాజీ చైర్మన్ తల్లెల చంద్రయ్య, ఐటీడీఏ డైరెక్టర్ పెందూర్ దేవన్న, ఆర్‌ఎస్‌ఎస్ మండల కన్వీనర్ లింగారెడ్డి, పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మ ల వెంకట్‌రెడ్డి, మద్దెల ఊశన్న, నాయకులు అడప తిరుపతి, గోవర్ధన్, రమేశ్, కిష్టారెడ్డి, అశోక్‌రెడ్డి, గంగాపుత్ర సంఘం అధ్యక్షుడు అశోక్, ఖయ్యూం, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

257
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles