గెలుపు ఖాయం.. మెజార్టీయే లక్ష్యం..!

Wed,September 12, 2018 12:21 AM

తెలంగాణచౌక్: ఆదిలాబాద్ నియోజకవర్గంలో మంత్రి జోగు రామన్న గెలుపుపై ఎలాంటి అనుమానాలు లేకపోవడంతో భారీ మెజార్టీయే లక్ష్యంగా టీఆర్‌ఎస్ నాయకులు ముందుకు సాగుతున్నారు. అసెం బ్లీ రద్దు దరిమిలా ప్రచార వ్యూహాలకు పదును పెట్టా రు. ఇంటి ముందు అభివృద్ధి.. కంటి ముందు అభ్య ర్థి అనే నినాదంతో దూసుకుపోతున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పరిస్థితి.. రాష్ట్రం వచ్చాక నాలుగున్నర సంవత్సరాల్లోనే జరిగిన అభివృద్ధిపై సవివరంగా తెలియజేసి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఒకవైపు టీఆర్‌ఎస్ నాయకులు ప్రచార పర్వంలో దూ సుకుపోతుంటే.. ప్రతిపక్షాలు ఆందోళనలో పడ్డాయి. పార్టీ టికెట్టు ఎవరికి వస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సం క్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు ఆదరిస్తుండడంతో వాటిని విమర్శించే దుస్సాహసం చేయలేని స్థితి లో ప్రతిపక్షాలున్నాయి. ప్రచారంలో ఏ వైఖరి తీసుకోవాలో తెలియక సతమతమవుతున్నాయి. రాష్ట్ర మంత్రి జోగు రామన్న అసెంబ్లీ టికెట్టు ఖరారు చేసిన మరుసటి రోజు నుంచే టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై రాబో యే ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రచార వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నా ప్రజల వద్దకు వెళ్లి ప్రచారం చేయకుండా ఉదాసీన వైఖరి ప్రదర్శించరాదంటూ పార్టీ శ్రేణులకు హితబోధ చేశారు.

గడప గడపకూ ప్రచారం..
మంత్రి జోగు రామన్న ప్రతి వార్డు, ప్రతి గ్రామం తిరుగుతూ సీఎం కేసీఆర్ చేసిన మంచి పనులను ప్రజలకు వివరిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ ఆరు కిలోల బియ్యం మొదలుకొని ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్లు, రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులకు సబ్సిడీ రుణాలు, కంటి వెలుగు, రహదారుల నిర్మాణాలు, పెన్‌గంగ బ్యారేజీ నిర్మాణం, తండాలు, గూడేలకు పంచాయతీ హోదా, మిషన్ కాకతీయ చెరువులు, మిషన్ భగీరథ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతున్నారు. సమైక్య రాష్ట్రంలో అన్యాయానికి, వివక్షతకు గురైన తె లంగాణను, నాలుగున్నర సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధిని వివరించి ప్రజలను ఆలోచింపజేస్తున్నారు. వృద్ధులను పలకరించి ఆసరా పింఛన్లు వస్తున్నాయా? లేవా? అని ఆరా తీస్తున్నారు. రైతు బంధు పథకం కింద గతంలో ఎకరాకు రూ.4వేల చొప్పున అందజేశామని.. రానున్న నవంబర్ నెలలో కూడా మ రోమారు యాసంగి పంటకు రైతు బంధు పథకం వర్తిస్తుందని.. సాగు కోసం అప్పులు చేయాల్సిన అవస రం లేకుండా కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై అభిప్రాయాలు కోరుతున్నారు.

ఓటరు నమోదుకు కార్యాచరణ..
తాజాగా ఓటరు నమోదు ముసాయిదా వెలువడడంతో 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు పార్టీ ఆధ్వర్యంలో ఓటు హక్కు నమోదు చేయించాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో పార్టీ నాయకు లు వార్డుల వారీగా బాధ్యతలు తీసుకొని ఓటరు న మోదు చేయించడంతో పాటు నియోజకవర్గంలో మంత్రి జోగు రామన్న చేసిన అభివృద్ధిని వివరిస్తున్నా రు. టీఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాజిదోద్ద్దిన్, ప్రధాన కార్యదర్శి కాళ్ల విఠల్ ఆదిలాబాద్ పట్టణంలో 36 వార్డులకు ఇన్‌చార్జిలను నియమించారు. 36 వార్డుల్లో ఆరు వార్డులకు ఇద్దరి చొప్పున బాధ్యతలు అ ప్పజెప్పారు. సాజిదోద్దిన్, కౌన్సిలర్ అజయ్‌కి 13, 14,15,16,17,18,19 వార్డుల్లో ఓటరు నమోదు, ప్రచార బాధ్యతలు అప్పజెప్పారు. కాళ్ల విఠల్, జోగు ప్రేమేందర్‌కు 21, 22, 23, 24, 25, 26 వార్డులు, అడ్డి భోజారెడ్డి, అశోక్ స్వామికి 5, 1, 2, 33, 34, 35, 36 వార్డులకు, సిరాజ్ ఖాద్రి, గండ్రత్ రాజుకు 8,6,7,20,29 వార్డులకు జహీరొద్దీన్, ఉదయ్‌కి 27, 28, 30, 31, 32 వార్డులకు జహీర్ రంజానీ, బాదం గంగన్నకు 3, 4, 9, 10, 11, 12 వార్డుల బాధ్యతలను అప్పజెప్పారు. యువతీ యువకుల వయస్సు తెలుసుకొని ఓటరు నమోదు ఫారాలను నింపి బీఎల్‌వోలతో కలిసి ఓటరు నమోదు చేస్తున్నారు.

341
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles