ఎన్నికలకు సమాయత్తం


Wed,September 12, 2018 12:21 AM

ఆదిలాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలో ప్రస్తుతం మొత్తం 3,52, 666 మంది ఓటర్లు ఉన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 1,78,715 మంది ఓటర్లు ఉంటే.. 89,634 మంది పురుషులు, 89,038 మంది మహిళలు ఉండగా.. 45 మంది ఇతరులున్నారు. బోథ్ నియోజకవర్గంలో 1,73,951 మంది ఓటర్లు ఉండ గా.. 86,580 మంది పురుషులు, 87,355 మంది మహిళలు, ఉండగా 16 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 261 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. బోథ్‌లో 257 పోలింగ్ కేంద్రాలున్నాయి. అక్టోబర్ 8న తుది జాబితాను విడుదల చేసి ఆ జాబితాలోని ఓటర్లే వచ్చే ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులుగా ఉంటారు. బూత్‌ల వారీగా ఓటర్ల మార్పులు, చేర్పుల్లో భాగంగా ఈ నెల 15, 16 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయినింగ్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా గ్రామసభలు నిర్వహిస్తారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవల్ అధికారులు ఓటరు జాబితా తో పాటు అందుబాటులో ఉంటారు. స్థానికులు పోలింగ్ స్టేషన్‌కు వెళ్లి తమ పేర్లును చూసుకుని అవకాశం ఉంటుంది.

తాజా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25 వరకు మార్పులు, చేర్పులు, అభ్యంతరాల స్వీకరణకు గడువు ఉండడంతో ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 2018 జనవ రి ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు ఓటరు జాబి తాలో తమ పేర్లు నమోదు చేసుకొనే అవకాశం ఉంది. 6ఏ ఫారం ద్వారా వీరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవచ్చు. జాబితా నుంచి పేర్లను తొలగించుకొనే వారు ఫారం 7 ద్వారా వివరాలు అందజేయాలి. ఫారం 8 ద్వారా తప్పులను సవరించుకొనే అవకాశం ఉంది. జిల్లాలో ఓటరు జాబితా సవరణపై జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి రెండ్రోజుల కిందట, కలెక్టర్ దివ్య మంగళవారం అధికారులు, రాజకీయ పార్టీ నాయకులతో సమీక్ష నిర్వహించారు. సవరణ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని ఆమె అధికారులను ఆదేశించారు. జాబితా నుంచి ఓటర్లను తొలగించేటప్పుడు సరిగా నిర్ధారించుకొని నోటీసులు జారీ చే యాలని సూచించారు. రెండు చోట్ల ఓటు హక్కు ఉన్నా వారి పేరు ఒకే చోట ఉం డేలా చూడాలని మరణించిన వారి పేర్లను సైతం జాబితా నుంచి తొలగించాలని వారు తెలిపారు.

273
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...