త్యాగ ధనులు.. అటవీ శాఖ అధికారులు

Wed,September 12, 2018 12:21 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : త్యాగధనులు అటవీ అధికారులు అని జిల్లా ఫారెస్టు అధికారి ప్రభాకర్ కొనియాడారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని అటవీ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా పట్టణంలో అటవీశాఖ అధికారులు మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టారు. అనంతరం అమరుల స్మారకార్థం స్తూపం నిర్మాణం కోసం భూమిపూజ చేశారు. అనంతరం ఫారెస్టు కార్యాలయంలో అటవీ అమరులకు నివాళులు అర్పించారు. స్మృతి వనాలను నాటి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఫారెస్టు అధికారి మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల సేవలు మరువలేనివన్నారు. అడవుల రక్షణకు ప్రాణాలు లెక్క చేయకుండా నీతి నిజాయితీతో కలప స్మగ్లర్లను, వన్యప్రాణుల వేటగాళ్లను సాహసవంతంగా ఎదుర్కొంటూ విధులు నిర్వహించారని తెలిపా రు.

అమరులను స్ఫూర్తిగా తీసుకొని ప్రస్తుతం అధికారులు, సి బ్బంది బాధ్యతలకు అంకితం కావాలని పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమంలో అటవీశాఖ పా ల్గొని అడవుల పెంపకంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అడవుల జిల్లా ఆదిలాబాద్‌కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్వోలు అప్పయ్య, వాహబ్ అహ్మద్, గులామ్ మోహినొద్దీన్, శీలానంద్, శివకుమార్, తెలంగాణ జూనియర్ అటవీ అధికారుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గీరయ్య, ప్రశాంత్, సెక్షన్ ఆఫీసర్లు కె.గులాబ్, మోబత్‌రావు, వేణుగోపాల్, ప్రేంసింగ్, కేశవ్, హైమద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

306
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles