100 డేస్ యాక్షన్ ప్లాన్‌తో నేరాల నియంత్రణ

Wed,September 12, 2018 12:21 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : ఎక్సైజ్ నేరాల నియంత్రణకు 100 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భా గంగా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా దాడులు చేపడుతున్నామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కిషన్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సూపరింటెండెంట్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పా టు చేసి ఆయన మాట్లాడారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిషనర్ అకున్ సబర్వాల్ ఆదేశాల మేరకు జిల్లాలో వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. గుడుంబా స్థావరాలు, దేశీదారు విక్రయ కేంద్రాలపై ముందస్తు సమాచారంతో దాడులు చేపట్టామన్నారు. బార్లు, వైన్ షాపుల్లో తనిఖీలు చేసి శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపించామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 107 కేసు లు నమోదు కాగా.. 51 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. 51 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకొని 12 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఐడీ 20 కేసు లు నమోదు కాగా.. 12 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. 360 లీటర్ల బెల్లంపానకం ధ్వంసం చేసి 29 తాడి షాపుల్లో శాంపిళ్లను సేకరించామని చె ప్పారు. అక్రమ మద్యం దేశీదారు 568 బాటిళ్లను స్వా ధీనం చేసుకొని 15 మందిని అరెస్టు చేశామన్నారు. నాటు సారా వ్యాపారం మాన్పించి గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో పది మందికి రూ.రెండు లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించిందని తెలిపారు. ఎవరైనా జిల్లాలో నాటు సారాపై ఆధారపడి జీవనం గడుపుతున్న వారు వృత్తిని మానేసి ఆర్థిక సహాయం కోసం జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎక్సైజ్ శాఖ 1.70 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యం గా పెట్టుకున్నామని తెలిపారు. ఇప్పటి వరకు లక్ష మొ క్కలను నాటామని తెలిపారు. వచ్చేనెల 15న ఎక్సైజ్ డే నిర్వహిస్తామని, ఆ రోజు 70 వేల మొక్కలను నాటుతామన్నారు. సమావేశంలో సీఐలు శ్రీనివాస్, రాజమౌళి ఉన్నారు.

298
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles