వీఆర్వో పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి


Wed,September 12, 2018 12:21 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : జిల్లాలో ఈనెల 16న జరగనున్న వీఆర్వో పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ జి.సంధ్యారా ణి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పరీక్ష ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్‌సీ ఆధ్వర్యంలో వీఆర్వో పరీక్షను నిర్వహిస్తారని తెలిపారు. ఎలాంటి సమస్యలకు తావివ్వకుం డా, నిబంధనల మేరకు మంచి వాతావరణంలో పరీక్ష జరిగేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాలో 79 కేంద్రాల్లో 22,428 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. ఆదిలాబాద్ (అర్బన్), మావల గుడిహత్నూర్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాల్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయని తెలిపారు.

అన్ని కేంద్రాల్లో పరీక్ష రాసే అభ్యర్థులకు కుర్చీలు, బెంచీలు, తాగునీరు, విద్యుత్ వంటి కనీస వసతులు కల్పించాలన్నారు. పరీక్ష ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఉంటుందని తెలిపారు. పరీక్ష నిర్వహణతో ఎలాంటి సమస్యలు జరగకుండా పోలీసుల సహకారంతో పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లపై ఆయా కేంద్రాలకు కేటాయించిన పర్యవేక్షకులు పరీశిలించి అవసరమైన వాటిని సమకూర్చేందుకు తెలియజేయాలన్నారు. అభ్యర్థులు వారి గ్రామాల నుంచి పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ప్రతి మండలానికి లైజన్ అధికారిగా జిల్లా అధికారులను నియమించడం జరిగిందన్నారు. మొత్తం 15 రూట్లుగా గుర్తించామని, అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తారని చెప్పారు. సమావేశంలో ఏఎస్పీ సాధు మోహన్, డీఆర్వో నటరాజ్, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.

279
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...