లక్ష్మణ్‌రావు సేవలు చిరస్మరణీయం


Wed,September 12, 2018 12:20 AM

తెలంగాణచౌక్ : మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నప్పుడు లక్ష్మణ్‌రావు పట్టణ ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ అన్నారు. మంగళవారం టీఎన్జీవోస్ భవనంలో దివంగత లక్ష్మణ్‌రావు సంస్మరణ సభను నిర్వహించారు. ఎంపీ నగేశ్, డీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డి హాజరై ఆయన చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఎంపీ నగేశ్ మాట్లాడుతూ.. లక్ష్మణ్‌రావు అనారోగ్యంతో మృతిచెందడం బాధాకరమన్నారు. ఆయన భౌతికంగా లేకున్నా.. ఆయన చేసిన సేవలు పట్టణ ప్రజలకు గుర్తుంటాయన్నారు.1980లో దశాబ్దం పాటు పట్టణ రాజకీయాలను శాసించారన్నారు. యువశక్తి అనే ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేసి సహచర కౌన్సిలర్ల సహకారంతో మున్సిపల్ చైర్మన్ పదవిని అధిరోహించారన్నారు. రెండు పర్యాయాలు చైర్మన్‌గా పని చేశారని, ఆ కాలంలో ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేద ప్రజలకు పట్టాలు అందించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. పట్టణ ప్రజల తాగునీటి సమస్యను నివారించేందుకు కృషి చేశారని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీష, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు పవన్‌రావు, రైతు సమన్వయ సమితి జిల్లా కో-ఆర్డినేటర్ అడ్డి భోజారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాంచంద్రారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారుఖ్ అహ్మద్, టీజీఏ జిల్లా అధ్యక్షుడు శ్యాంనాయక్, టీఎన్‌జీవోస్ జిల్లా అధ్యక్షుడు అశోక్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్‌రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొని లక్ష్మణ్‌రావు చిత్రపటానికి నివాళులర్పించారు.

268
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...