బూత్ ఏజెంట్లను నియమించుకోవాలి


Wed,September 12, 2018 12:20 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించు కోవాలని కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జనవరి ఒకటి 2018 నాటికి 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలన్నారు. ఈ నెల 10న ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేశారన్నారు. అభ్యంతరాలు, ైక్లెములు ఉంటే ఈనెల 25వ తేదీ వరకు తెలుపవచ్చన్నారు. ఈనెల 15,16 తేదీల్లో ఆయా పోలింగ్ కేంద్రాల్లో బుత్‌స్థాయి అధికారులు అందుబాటులో ఉండి ఓటరు నమోదు కార్యక్రమాలు చేపడుతారని చెప్పారు. అక్టోబర్ నాలుగు నాటికి ఆక్షేపణలు, అభ్యంతరాలను పరిష్కరించడం జరుగుతుందన్నారు.

అక్టోబర్ 7న డాటాబేస్ అప్‌డేట్ చేస్తారని, అక్టోబర్ 8న ఫైనల్ ఎలక్ట్రోరోల్ ప్రకటిస్తారని తెలిపారు. ఎలక్ట్రోరల్ జాబితా పారదర్శకంగా ఎలాంటి అభ్యంతరాలకు తావివ్వకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం పనిచేస్తున్నదని, ఇందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు. అంతకు ముందు జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ.. జిల్లాలో ఆదిలాబాద్, బోథ్ శాసన సభ నియోజక వర్గాల పరిధిలోని 518 పోలింగ్ కేంద్రాల్లో 3,52,666 ఓటర్లు (10-09-2018) ఉన్నారని తెలిపారు. అర్హత ఉన్న వారు వారి పేరును ఈనెల 25లోగా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. సమావేశంలో ఆర్డీవో సూర్యనారాయణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు ప్రభాకర్ స్వామి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

269
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...