కొండగట్టు మృతులకు మంత్రి జోగు రామన్న సంతాపం


Wed,September 12, 2018 12:20 AM

తెలంగాణచౌక్: జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 55 మంది మృత్యువాత పడడం బాధాకరమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబీకులకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరారు. వైద్యశాలల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు.

270
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...