బాధ్యతగా పనిచేయాలి


Wed,September 12, 2018 12:19 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : హెడ్ కానిస్టేబుళ్లుగా ఉద్యోగోన్నతి పొందిన వారు బాధ్యతతో పని చేయాలని ఎస్పీ విష్ణువారియర్ అన్నారు. మంగళవారం స్థానిక పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ఇటీవలే ప్రమోషన్లు పొందిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఏఆర్ విభాగంలో ఉమ్మడి జిల్లాలో పని చేస్తున్న 59 మంది కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా ఉద్యోగోన్నతి కల్పించామన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు ఇద్దరు, నిర్మల్ జిల్లాకు ఏడుగురు, మంచిర్యాల జిల్లాకు 16, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు 34 మందిని కేటాయిస్తూ బదిలీల ఉత్తర్వులు జారీ చేశామన్నారు. సుదీర్ఘకాలం పాటు ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ ఉద్యోగోన్నతులతో ఉమ్మడి జిల్లా ఏఆర్ విభాగంలో నూతన ఉత్సాహం నెలకొందన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకొని మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ప్రవేశపెడుతున్న నూతన సంస్కరణలతో భారీగా ప్రమోషన్లు వర్తిస్తున్నాయన్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసు అధికారులకు, సిబ్బందికి ప్రమోషన్లు వస్తున్నాయని చెప్పారు. త్వరలో వివిధ హోదాలో ఉన్న మరి కొందరికి ప్రమోషన్లు రానున్నాయని, పోలీసు కార్యాలయంలో కార్యానిర్వహణాధికారి వి.అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో సీనియారిటీ జాబితాను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పోలీసు అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బొర్లకుంట పోశలింగం, పెంచాల వెంకటేశ్వర్లు, మీర్ విరాసత్ అలీ, శ్రీరాములు, కార్యనిర్వహణాధికారులు అశోక్‌కుమార్, జోసేఫిన్, దుర్గం శ్రీనివాస్, జగదీశ్, రమేశ్, అమీన్, బలిరాం తదితరులు పాల్గొన్నారు.

245
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...