అంతుచిక్కని వ్యాధితో మేకలు మృతి


Wed,September 12, 2018 12:19 AM

ఇంద్రవెల్లి : అంతుచిక్కని వ్యాధితో మేకలు మృతి చెందడంతో గిరిజన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మండలంలోని తేజాపూర్ గ్రామపంచాయతీ పరిధి సాలేగూడ గ్రామానికి చెందిన తోడసం బడ్డు, మాడవి భీమ్‌రావ్‌కు చెందిన మేకలు అంతుచిక్కని వ్యాధితో మంగళవారం మృతి చెందాయి. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. సాలేగూడ గ్రామానికి చెందిన తోడసం బడ్డుకు చెందిన ఆరు మేకలు మృతి చెందడంతో రూ.30 వేల ఆర్థిక నష్టం జరగగా, మడవి భీమ్‌రావ్‌కు చెందిన మూడు మేకలు మృతి చెందడంతో 15 వేల రూపాయలు ఆర్థిక నష్టం జరిగిందన్నారు. మేకలకు బీమా చేశామని, అధికారులు స్పందించి చనిపోయిన మేకలకు ఇన్సురెన్స్ మంజూరు చేయాలని చెప్పారు. వారం రోజుల్లోనే గ్రామంలో ఇలా మేకలు మృతి చెందడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మేకల పెంపకం, ఆరోగ్యంపై పశువైద్యాధికారులు రైతులకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు.

248
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...