అక్రమంగా నిల్వ ఉంచిన 384 దేశీదారు బాటిళ్ల స్వాధీనం


Wed,September 12, 2018 12:19 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : జిల్లా సరిహద్దులోని పెన్‌గంగా నది ఒడ్డున అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సీఐ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. వంద రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా జిల్లా సరిహద్దులో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భీంపూర్ మండలం వడూర్ గ్రామం వద్ద పెన్‌గంగా నది ఒడ్డున అక్రమంగా దేశీదారును నిల్వ ఉంచినట్లు సమాచారం అందిందన్నారు. ఈ మేరకు సిబ్బందితో కలిసి దాడి చేసి 384 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకోగా.. నిందితుడు నారాయణ పరారీలో ఉన్నట్లు చెప్పారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో పట్టుకొని రిమాండ్‌కు తరలిస్తామన్నారు. మహారాష్ట్ర నుంచి అక్రమ మద్యం రవాణా చేస్తే ఆయా ప్రాంతాల పోలీస్ స్టేషన్లకు, ఎక్సైజ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. దేశీదారు పట్టుకున్న వారిలో ఎస్సైలు సంజీవ్, అరుణ్, సంధ్యరాణి, సిబ్బంది ఉన్నారు.

231
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...