మైనర్లకు వాహనాలిస్తే కేసులు


Wed,September 12, 2018 12:19 AM

ఖానాపూర్ : మైనారిటీలకు వారి తల్లిదండ్రులు నడిపేందుకు ద్విచక్ర వాహనాలు ఇస్తున్నారని, అది నేరమని ఎస్సై గోగీకర్ ప్రసాద్ తెలిపారు. ఖానాపూర్‌లో మంగళవారం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ఉల్లెంగుల రంజిత్ అనే 16 ఏళ్ల బాలుడు ద్విచక్ర వాహనం నడుపుతూ పట్టుబడ్డాడని చెప్పారు. బాలుడి తండ్రి ఉల్లెంగుల రాజేశ్వర్‌ను పిలిపించి తండ్రి, కొడుకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. పిల్లలకు వాహనాలిస్తే వారికి అవగాహన లేకుండా మితిమీరిన వేగంతో నడుపుతారన్నారు. దీంతో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని, రోడ్డుపై వెళ్లే వారికి కూడా ప్రాణాపాయం కలిగే ఆస్కారం ఉందన్నారు. ఇకపై మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ విషయాన్ని గమనించాలని ఎస్సై సూచించారు.

224
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...