గంగాపూర్‌లో రైతు బలవన్మరణం


Wed,September 12, 2018 12:19 AM

కడెం : మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన భుక్యా శేషురావు (42) అనే రైతు అ ప్పుల బాధతో క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చే సుకొన్నాడు. కడెం ఎస్సై సయ్యద్ ముజాహిద్ తెలిపిన వివరాల ప్ర కారం.. శేషురావు పంటసాగు కోసం రూ. రెండు లక్షలు అప్పు చేశా డు. ఇటీవల తన కూతురు వివాహం కోసం మరో రూ. రెండు లక్షల ను మొత్తం రూ. 4 లక్షల వరకు అప్పు చేశాడు. చేసిన అప్పును పంట పండించి తీర్చుదామని అనుకున్నాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాల తో పంట పూర్తిగా ధ్వంసమైంది. దీంతో చేసిన అప్పులు తీర్చలేనని మనస్తాపం చెందిన రైతు సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయం లో క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆలస్యం గా గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఖానాపూర్ ప్రభు త్వ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. శేషురావుకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు కాగా, ఒకరికి వివాహం చేశాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ముజాహిద్ తెలిపారు.

206
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...