జ్వరంలో ఇద్దరు మృతి


Wed,September 12, 2018 12:19 AM

గాదిగూడ/నార్నూర్ : జ్వరంతో ఒకే ఇంట్లో మృత్యువాత పడ్డ సంఘటన గాదిగూడ మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని ఖడోడి గ్రామానికి చెందిన లింబారావ్ కుమారుడు ఆత్రం తుకారామ్(14), ఆత్రం సైలిక్‌రావ్ ఎనిమిది నెలల బాలుడు జ్వరంతో సోమవారం మృత్యువాత పడ్డారు.
కుటుంబీకులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. తుకారామ్, బాబుకు జ్వరం రావడంతో వైద్యం కోసం ఉట్నూర్ ప్రభుత్వ దవాఖానకు తరిలించారు. వైద్యం పొందుతూ మృతి చెందారు. సమాచారం తెలిసిన ఉట్నూర్ ఆర్డీవో వినోద్‌కుమార్ మంగళవారం ఖడోడి గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఇద్దరి మృతిపై విచారణ చేపట్టారు.

గ్రామాల్లో సరైన సౌకర్యాలు లేక మృత్యువాత పడ్డా పట్టించుకునేవారు లేరంటూ గిరిజనులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గ్రామానికి రావాలంటే కనీసం రోడ్డు సౌకర్యం లేదని, గ్రామానికి రోడ్డు, నీటి సౌ కర్యంతో పాటు వైద్య సేవలు అందించేలా చూడాలని ఆర్డీవోకు విన్నవించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఆయన వెంట గా దిగూడ తహసీల్దార్ చంద్రశేఖర్, వీఆర్వో నర్సిములు, ఏఎస్సై దా మన్, గ్రామస్తులు ఉన్నారు.

209
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...