ప్రచార హోరు..!

Tue,September 11, 2018 12:30 AM

-దూసుకుపోతున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులు
-మంత్రి జోగురామన్నకు అర్చకుల సంఘీభావం
-పట్టణంలో మంత్రి, తలమడుగులో మాజీ ఎమ్మెల్యే విస్తృత ప్రచారం
-టీఆర్‌ఎస్‌కు మద్దతు కులసంఘాల మద్దతు
ఆదిలాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : .. ఈ ఫోటోలో మాట్లాడుతున్న అర్చకుడి పేరు పనగంటి విలాస్ శర్మ. ఈయన అర్చక సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేవాలయాలు, అర్చకుల జీవితాలు బాగుపడ్డాయని అన్నారు. తమ ఆశీర్వాదం మంత్రి జోగు రామన్నతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. సోమవారం ఆదిలాబాద్ సాయిమందిరంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో దూపదీప నైవేద్యం పథకం కింద ఎంపికైన ఆలయాల్లో పనిచేసే అర్చకులకు మంత్రి జోగు రామన్న ప్రొసీడింగ్ కాపీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో విలాస్ శర్మ మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం సుభిక్షంగా ఉండటానికి ఆయుత చండీ యాగం నిర్వహించారన్నారు. గొప్పగొప్ప వ్యక్తులే అలాంటి మహాయజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. సమాజంలో పూజారులకు ప్రత్యే క గౌరవం ఉందన్నారు. అర్చకులకు గతంలో రూ.2500 వేతనం ఉంటే అందులో రూ.1000 ఆ లయ ఖర్చులకు పోను కేవలం రూ.1500 మాత్రమే చెల్లించేవారన్నారు. అర్చకులు కడుపునిండా అన్నం తినలేకపోయే వారన్నారు. చేతిలో డబ్బులు లేక ఆలయంలో పూజలు కూడా చేయలేని పరిస్థితి ఉండేదన్నారు. సీఎం కేసీఆర్ అర్చకుల సమస్యలు తెలుసుకుని రూ.2500 నుంచి రూ.6వేలకు పెంచారన్నారు. రూ.2 వేలు ఆలయ ఖ ర్చులకు పోగా రూ.4వేలు పూజారి కుటుంబానికి దక్కుతుందన్నారు.

..ఇలా జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రచారానికి అన్ని వర్గాల ప్ర జలు బ్రహ్మర థం పడుతున్నా రు. జిల్లాలో ఆ దిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎన్నికల ప్రచారం జోరు గా సాగుతోంది. సోమవారం మంత్రి జోగు రా మన్న పట్టణంలో పలు కులసంఘాలతో భేటీ అ య్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ మద్దతు టీఆర్‌ఎస్‌కు ఉంటుందని వివిధ కులసంఘాల నాయకు లు ప్రకటించారు.

బోథ్ నియోజకవర్గంలో బాపురావు..
బోథ్ నియోజకవర్గంలోని ఖోడద్, రుయ్యాడిలో మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ప్రచారాన్ని నిర్వహించారు. రజక సంఘ భవనంలో ఆ సంఘం నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో ఎన్న డూలేని విధం గా నాలుగేళ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామన్నారు. అన్ని కులాలకు, చేతివృత్తులకు రాయితీ రుణాలతో ఆర్థికంగా అభివృద్ధి చేశామని తెలిపారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన వంతు సహాయ సహకారాలు అందించానన్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి మరోసారి ఓటు వేసి గెలిపించాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో జరిగిందన్నారు. దేశం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తోందని పేర్కొన్నారు. తలమడుగు మండ లం ఖోడద్, రుయ్యాడి గ్రామాల్లో ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి బాపురావు మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. కులవృత్తులకు ప్రో త్సాహం అందించడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మె రుగు పడిందన్నారు. ఈ గ్రామాల ప్రజలు బాపురావుకు ఘన స్వాగతం పలికి తమ మద్దతు తెలిపారు.

302
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles