పేదల జీవితాల్లో కంటి వెలుగు


Tue,September 11, 2018 12:29 AM

ఎదులాపురం : జిల్లాలో కంటి వెలుగు పథకానికి అనూహ్య స్పందన లభిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన శిబిరాలను పెద్దసంఖ్యలో ప్రజలు హాజరై కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. ఊహించని విధంగా వస్తున్న జనంతో శిబిరాలు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఈ మేరకు వైద్యాధికారులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 18మండలాలు, 467 గ్రామాల్లో 51,171 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు.

ఐదు టేబుళ్ల విధానంలో పరీక్షలు..
కంటి వెలుగు పథకం ద్వారా కంటి జబ్బులతో బాధపడుతున్న వ్యక్తులను గుర్తించి వారికి ఉచితంగా చికిత్స అందించాలనేది సర్కార్ ఉద్దేశం. వైద్యాధికారులు ఐదు టేబుళ్ల విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొదటి విధానంలో సంబంధిత వ్య క్తుల రిజిస్ట్రేషన్, రెండో విధానంలో చూపు సామర్థ్యం పరీక్ష, మూడో విధానంలో కంటి పరీక్ష, నాలుగో విధానంలో ఏఆర్ మిషన్ ద్వారా కంటి పరీక్ష, ఐదో విధానంలో మందులు, అద్దా లు అందజేయడం ద్వారా వైద్యం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పథకానికి జనం నుంచి భారీ స్పందన వస్తోంది. జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో రోజూ 18 శిబిరాలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 15, ఆదిలాబాద్ పట్టణంలో మూడు శిబిరాలను ఏర్పాటు చేశారు. ఆయా శిబిరాల్లో 15 మందితో కూడిన వైద్య బృందం విధులు నిర్వహిస్తోంది. 18 మంది వైద్య నిపుణులు, 18 మంది మెడికల్ ఆఫీసర్లు , 72 మంది ఆశవర్కర్లు , 36 మంది స్టాఫ్ నర్సులు, 54 మంది ఏఎన్‌ఎంలు, 18 మంది ఫార్మసిస్టులు, 18 మంది హెల్త్ సూపర్‌వైజర్లు, ఇతర సిబ్బంది కంటి వెలుగు కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు.

ప్రజల నుంచి స్పందన బాగుంది..
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటున్నారు. వారి నుంచి స్పందన బాగానే వస్తుంది. ప్రభుత్వ ఉ ద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్న వారు సైతం ఈ పరీక్షలు చేయించుకుంటున్నారు. కొంత మంది సమయం లేక, మరికొంత మందికి తల్లిదండ్రులకు, నానమ్మలకు కంటి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి వెళ్లని వారు ఉన్నారు. వారు సైతం కేంద్రాలకు వచ్చినప్పుడు ఈ విషయాలు తమ దృష్టికి తీసుకవస్తున్నారు.
- డాక్టర్ సాధన, డిప్యూటీ డీఎంహెచ్‌వో, స్పెషల్ ఆఫీసర్

ఇంత బాగా పరీక్ష చేస్తారనుకోలేదు..
కంటి వెలుగు కార్యక్రమం గురించి ముందే చెప్పిండ్రు గానీ ఇంత మంచిగా సూస్తరనుకోలేదు. సర్కారు డాక్టర్లు ప్రైవేట్ వారికంటే ఎక్కువగా ఓపికతో పరీక్షలు చేస్తారనుకోలేదు. కానీ ఇయ్యాల్ల మా గ్రామంలో నేను కంటి పరీక్ష చేసుకొని అద్దాలు తీసుకున్న తరువాత తెలిసింది ఈ పథకం విలువ. సర్కారు మేలు మరువము.
- పెండర్‌వార్ పుణ్యవతి, రైతు,
అంతర్గాం, భీంపూర్ మండలం

249
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...