నిర్మల్ దవాఖానలో ఏడేండ్ల చిన్నారికి అరుదైన చికిత్స


Tue,September 11, 2018 12:28 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ: జిల్లా కేంద్రంలోని కావేరి పిల్లల దవాఖానలో అరుదైన చికిత్స సకాలంలో అందడండంతో ఏడేండ్ల చిన్నారి ప్రాణాలతో బయటపడింది. మామడకు చెందిన ఏడేండ్ల బాలిక చరిత తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వాంతులతో గత నెల 31న కావేరి దవాఖానలో చేరింది. సహజంగా ఉండే జ్వరం, తలనొప్పి లక్షణాలు చూసి ముందుగా ప్రమాదమేమీ లేదనుకున్న వైద్యులు రోగ లక్షణాలు తగ్గకపోవడంతో కారణాలను విశ్లేషించారు. పిల్లల వైద్యుడు డాక్టర్ అప్పాల చక్రధారి, వైద్య బృందం కావేరి శ్రీకాంత్, నాగరంజని, న్యూరో డాక్టర్ కుంట రమణేశ్వర్ బృందం బాలికకు మెదడు పొరల్లో రక్తస్రావం, పలుచోట్ల గడ్డ కట్టినట్లు గుర్తించారు. రక్తాన్ని కరిగించేందుకు మందులతో డాక్టర్ల బృందం రక్తప్రసరణ వ్యవస్థను రక్తం గడ్డకట్టే వ్యవస్థను నియంత్రిస్తూ వైద్యం అందించారు. పాపకు ఎలాంటి హాని జరగకుండా 9 రోజుల పాటు వైద్య పరీక్షలు నిర్వహించారు. మెదడులోని సిరల్లో రక్తప్రసరణ వ్యవస్థ లోపాలను గుర్తించి సరి చేశారు. సిటీ స్కాన్ ద్వారా గడ్డ కట్టిన రక్తం దాదాపుగా కరిగిపోయిందని గుర్తించి సోమవారం పాపనును డిశ్చార్జ్ చేశారు. తల్లిదండ్రులతో పాటు బంధువులు వైద్యులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

251
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...