అసాంఘిక శక్తులపై నిఘాకే కార్డన్ సెర్చ్


Tue,September 11, 2018 12:28 AM

భైంసా/ నమస్తే తెలంగాణ : అసాంఘిక శక్తులపై నిఘా కొనసాగించడానికే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ శశిధర్‌రాజు తెలిపారు. సోమవారం పట్టణంలో డీఎస్పీ బల్ల రాజేశ్, సీఐలు శ్రీనివాస్, ప్రవీణ్‌కుమార్, శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజీవ్‌నగర్, నర్సింహానగర్, సాయినగర్ కాలనీల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తెల్లవారు జాము నుంచి పోలీసు బలగాలు కాలనీల్లో మొహరించి ప్రతి ఇంటికీ వెళ్లి సోదా చేశాయి. ద్విచక్ర వాహన పత్రాలను పరిశీలించారు. అనంతరం కాలనీల్లో సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. 120 పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు పట్టుకున్నారు. కార్యక్రమంలో ఎస్సైలు పున్నం చందర్, యూనిస్ అహ్మద్‌అలీ, భరత్‌సుమన్, రాజన్న, వినోద్, రమేశ్, మహేశ్, తిరుపతి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

247
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...