నిఘా నీడలో..


Mon,September 10, 2018 12:12 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : ముం దస్తు ఎన్నికల ప్రచారం, గణేశ్ ఉత్సవాలు రావడం తో ఇంటలీజెన్సీ నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసు యంత్రాంగం ఈ ఉత్సవాలపై నిఘా పెట్టనుంది. పట్టణంలో 400 గణేశ్ మండపాలు, గ్రామీ ణ ప్రాంతాల్లో 760 మండపాలను ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఏర్పాట్లకు సంబంధిం చి ఇంటలీజెన్సీ వర్గాలు సమాచారాన్ని సేకరిస్తున్నా రు. సమస్యాత్మక ప్రాంతాలు150 ఉన్నట్లు గుర్తించా రు. ఈ ప్రాంతాల వద్ద ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎస్పీ కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేయనున్నారు. ఆ ప్రాంతాల వద్ద ఎప్పటికప్పుడు జరుగుతున్న సమాచారాన్ని తెలుసుకోడానికి ప్రత్యేక సిబ్బందిని సైతం నియమించనున్నారు. వార్డుల వారీగా సెక్టార్లుగా విభజించి ఆ సెక్టార్లలో పె ట్రోలింగ్‌కు ప్రత్యేక సిబ్బందిని కేటాయించనున్నారు. ఈ గణేశ్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా సామరస్యంగా నిర్వహించేందుకు ఎస్పీ విష్ణు వారియర్ అన్ని వర్గాల ప్రజలతో శాంతి కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయిస్తూ పలు సలహాలు, సూచనలు చేస్తున్నారు. మసీదులు, మందిరాల వద్ద పికెటింగ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు భారీ బందోబస్తు ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఉత్సవాలపై ఇప్పటికే జిల్లా ఎస్పీ పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి సలహాలు, సూచనలు ఇచ్చారు.

సరిహద్దు గుండా చెక్‌పోస్టులు..
గణేశ్ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే జిల్లా సరిహద్దు గుండా పోలీసులు చెక్‌పోస్టులను ఏర్పాటు చే స్తున్నారు. మావల, చాందా, రాంపూర్, ఇచ్చోడ, బజార్‌హత్నూర్, ఉట్నూర్, హస్నాపూర్, సుంకిడి రహదారుల గుండా ఈ చెక్ పోస్టులను ఏర్పాటు చే సేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఈ రహదారుల గుండా వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయనున్నారు. జాతీయ రహదారిపై పెట్రోలింగ్ కోసం ప్రత్యేక టీంలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఈ బందోబస్తులో జీపీఎస్ సిస్టం ఉన్న కెమెరాలను వినియోగించనున్నారు. ఈ కెమెరాలకు ఎస్పీ కంట్రోల్ రూం తో పాటు హైదరాబాద్‌లో కమాండ్ కంట్రోల్ రూం కు అనుసంధానం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు బం దోబస్తుకు సంబంధించిన వివరాలను కంట్రోల్‌రూంలో అధికారులు పర్యవేక్షించనున్నారు. ఉత్సవాలు, ఎన్నికల ప్రచారం ఒకేసారి రావడం ఇంటిలీజెన్సీ నిఘా వర్గాల సూచనల మేరకు అసాంఘిక శక్తు లు పట్టణంలో ప్రవేశించకుండా పోలీసుశాఖ ముందస్తు చర్యలను చేపట్టింది.

252
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...