అన్ని కులాల అభ్యున్నతికి కృషి

Mon,September 10, 2018 12:11 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ: అన్ని కులాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని రాష్ట్ర మంత్రి జోగురామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని బీసీ సంఘ భవనంలో ఆదివారం రాజ్‌పుత్ సంఘ నాయకులతో నిర్వహించిన సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. ఓబీసీలకు బీసీలోన్‌లను అందేలా కృషి చేస్తామన్నారు. రాజ్‌పుత్ సంఘ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇ చ్చారు. గత ప్రభుత్వాలు కులాలకు ప్రాధాన్యతను ఇవ్వలేదని ఆరోపించా రు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో అన్ని కులాలకు సంఘ భవనాలకు స్థలం, నిర్మాణానికి నిధులు కేటాయించారని పేర్కొన్నారు. అలాగే కుల వృత్తులను, చేతివృత్తులను ఆదుకునేందుకు సబ్సిడీపై రుణాలు అందజేశామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రుణాలు అందజేసి ఆర్థికంగా అభివృద్ధ్ది చేయడమే టీఆర్‌ఎస్ లక్ష్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. తనను ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే సేవకునిగా పని చేస్తానన్నారు. సమావేశంలో రాజ్‌పుత్ సంఘం నాయకులు జగత్ ప్రతాప్‌సింగ్, యువత అధ్యక్షుడు ఠాకూర్ స్వదీప్‌సింగ్, బాలాజీ సింగ్, సందీప్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.

జైనథ్: పొలాల అమావాస్య పండుగను ఆదివారం ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఆయా గ్రామాల్లో రైతులు ఎద్దులను, పాడిపశువులను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. నైవేద్యం సమర్పించారు. గ్రామాల్లోని హనుమాన్ ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. మండలంలో ని దీపాయిగూడలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర చుట్టు ఉన్న ఆదిలాబాద్ నియోజకవర్గంలో పొలాల అమావాస్య పండుగను రైతులు ఘనంగా జరుపుకుంటారన్నారు.
- నేరడిగొండ/బోథ్

269
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles