చరిత్రను వక్రీకరించుకోవడం మానుకోవాలి


Mon,September 10, 2018 12:10 AM

నిర్మల్ కల్చరల్ : చరిత్ర పరిశోదకులు, చరిత్ర కారులు గతంలో జరిగిన సంఘటనలను యధార్థంగా బావితరాలకు అందించినప్పుడే సరైన జాతి నిర్మాణం జరుగుతుందని, చరిత్రను వక్రీకరించుకోవడం మానుకోవాలని ప్రముఖ రచయిత, జాగృతి పత్రిక సంపాదకుడు డాక్టర్ వడ్డి విజయ సారధి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ప్రజ్ఞాబారతి-నిర్మల భారతి సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ కవి ఉపాద్యాయుడు, రచయిత తొడిశెట్టి పరమేశ్వర్ రచించిన ఇదేమి చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని ఆక్రమించి వందల ఏళ్లు పరిపాలన చేసిన పాలకుల కుటిల నీతితో స్వార్థ పూరిత ఆలోచనలకు చరిత్ర వక్రీకరించబడి నిజమైన సమాచారం అందడం లేదన్నారు. కార్యక్రమంలో వి.వి సుబ్రహ్మణ్యం,కట్టా నాగయ్యచారి, నూకల విజయ్ కుమార్, రాజేశ్వర్, కిషన్, అయ్యన్నగారి భూమయ్య, రావుల రాంనాథ్, మల్లికార్జున్ తదితరులున్నారు.

240
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...