వాంతులు చేసుకొని ఒకరి మృతి

Mon,September 10, 2018 12:09 AM

గుడిహత్నూర్: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌కు ఎదురుగా జాతీయ రహదారి పక్కన ఆదివారం సాయంత్రం ఓ వ్యక్తి వాంతులు చేసుకొని మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నిజాంకాలనీ చెందిన అంబెవార్ శంకర్(50) తన భార్యతో కలసి మండలంలోని కొల్హారి గ్రామానికి వస్తుండగా మండల కేంద్రానికి వెళ్లడానికి ఆటోలు దొరకకపోవడంతో నడుచుకుంటూ బయలుదేరామని, మండల కేంద్రంలో కొంత దూరం సర్వీస్ రోడ్డు వెంబడి వచ్చామని ఇలా వెళ్తే ఆటోలు వెళ్లిపోతాయని జాతీయ రహదారి వెంబడి వెళ్లడానికి ఎత్తు భాగంలోనున్న రోడ్డు ఎక్కామని, అంతలోనే వాంతులు చేసుకున్నాడని భార్య రోదిస్త్తూ చెప్పింది. పక్కన కూర్చోబెట్టేలోపు ప్రాణాలు వదిలాడని చెప్పింది. ఎలాంటి అనుమానంలేదని చెప్పడంతో కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని స్థానిక పోలీసులు అప్పగించారు.

193
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles