సమరానికి సన్నాహాలు

Sun,September 9, 2018 12:55 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : ఆ దిలాబాద్, నిర్మల్ జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలు పూర్తిగా, ఖానాపూర్ నియోజక వర్గంలోని రెండు మండలాలుండగా.. నిర్మల్ జిల్లాలో నిర్మల్, ముథోల్ నియోజక వర్గాలు పూర్తిగా, ఖానాపూర్ నియోజకవర్గంలోని నాలుగు మండలాలున్నాయి. ఆదిలాబాద్ నియోజక వర్గంలో 1,78,715మంది ఓటర్లు, బోథ్ ని యోజక వర్గంలో 1,73,951మంది ఓటర్లు, ఖా నాపూర్ నియోజక వర్గంలో 1,76,606 మంది ఓటర్లు, నిర్మల్ నియోజక వర్గంలో 1,86,512 మంది ఓటర్లు, ముథోల్ నియోజకవర్గంలో 1,93,731 మంది ఓటర్లు ఉన్నారు. ఆదిలాబాద్ లో 261 పోలింగ్ కేంద్రాలు, బోథ్‌లో 257, నిర్మల్‌లో 241, ముథోల్‌లో 270, ఖానాపూర్‌లో 238 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఐదు నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ ద్వారా రెండు జిల్లా ల్లో పోలింగ్ కేంద్రాలు కొత్తగా ఏర్పాటు అవుతున్నాయి. పట్టణంలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో 1400 ఓటర్ల కంటే ఎక్కువగా ఉండకుండా చర్య లు చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో 1200 మంది ఓటర్లకంటే ఎక్కువగా ఉండకుండా పోలింగ్ కేంద్రాలను రేషనలైజేషన్ చేశారు.

ఈ లెక్కన ఆదిలాబాద్ జిల్లాలో 518 పోలింగ్ కేంద్రాలు, నిర్మల్ జిల్లాలో 749 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండేలా అధికార యంత్రాంగం సన్నాహాలు చే స్తోంది. ఇప్పటికే ఓటరు జాబితా తయారవుతుండగా.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఈవీఎంలు సిద్దంగా ఉంచారు. ఉమ్మ డి జిల్లా వ్యాప్తంగా ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించి 16333ఈవీఎం మిషన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాను ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలుగా విభజించిన విషయం తెలిసిందే. జిల్లాల విభజన జరిగినప్పటికీ.. ఈవీఎంలు మా త్రం ఇప్పటికీ ఉమ్మడి జిల్లా ప్రకారమే ఉన్నాయి.

ఇకపై జిల్లాల విభజన ప్రకారం పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి ఆయా జిల్లాలకు ఈవీఎంలతో పాటు వీవీప్యాట్‌ల మిషన్లు అందించనున్నట్లు జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో జరగబోయే ఎన్నికల్లో తొలిసారిగా వీవీప్యాట్‌లను వి నియోగించనున్నారు. ఈ వీవీ ప్యాట్‌లు జిల్లాలో అన్ని ఈవీఎంలకు అనుసంధానం చేసి వినియోగించనున్నారు. ఒక్కో ఈవీఎంకు ఒక్కో వీవీప్యాట్‌ను వినియోగించేందుకు జిల్లా అధికారులు ఏ ర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల సంఖ్య ప్ర కారం ఈవీఎంలు, వీవీప్యాట్లు అందుబాటులో ఉంచుతుండగా.. మరో 30శాతం అదనంగా ఈవీఎంలు అందుబాటులో ఉంచుతున్నారు.

నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఐదు నియోజకవర్గాలు ఉండగా.. టీఆర్‌ఎస్ పార్టీ సిట్టింగ్‌లకే మళ్లీ టికెట్లు ఖరారు చేసింది. దీంతో రెండు రోజుల నుంచి అభ్యర్థులు ప్రచారంలోకి దిగారు. గురువా రం టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయగా.. శుక్రవారం రోజున అయిదు నియోజక వర్గాల అభ్యర్థులు తమ సెగ్మెంట్లకు చేరుకున్నారు. అభ్యర్థిత్వం ఖరారు చేశాక.. తొలిసారి నియోజకవర్గానికి వస్తున్నందున వీరికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. బైక్ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించారు. మంత్రులు జోగు రామన్న, అల్లో ల ఇంద్రకరణ్‌రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యేలు రాథో డ్ బాపురావు, అజ్మీరా రేఖానాయక్, గడ్డిగారి విఠ ల్‌రెడ్డి ఆలయాల్లో పూజలు నిర్వహించి.. ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధినే ఎజెండాగా తీసుకొని.. ప్రజల వద్దకు వెళ్తున్నారు. శనివారం నుంచి అన్ని చోట్ల ప్రచారం ప్రారంభమైంది. కులసంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. శనివారం రోజున ఆదిలాబాద్‌లో జోగు రామన్న కుల సంఘాలతో భేటీ అయ్యారు. నిర్మల్‌లో అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కదిలి, దేవరకో ట, ధర్మపురి దేవస్థానాలను దర్శించుకున్నారు. రా థోడ్ బాపురావు, అజ్మీరా రేఖానాయక్, గడ్డిగారి విఠల్‌రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.

247
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles