మెరుగైన భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు

Sun,September 9, 2018 12:53 AM

నిర్మల్ క్రైం : జిల్లా ప్రజలకు మెరుగైన శాంతి భద్రతలను అందించేందుకే జిల్లా కేంద్రంలో నూతనంగా 60 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని కరీంనగర్ రేంజ్ డీఐజీ పి.ప్రమోద్ కుమార్ అన్నారు. శనివారం పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్‌లో నూతనం గా ట్రాఫిక్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి, పోలీస్ స్టేష న్ ఆవరణలో మొక్కలను నాటి, వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకునేలా పోలీసు శాఖ వారు రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్‌లో రోడ్డు ప్రమాదాల నివారణపై రూరల్ సీఐ జీవన్‌రెడ్డి రూపొందించిన సీడీని ఆవిష్కరించి సీసీ కెమరాల పనితీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడారు. జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్ర మాదాలతో అనేక మంది మృత్యువాత పడుతున్నారని, ప్రతి నెలా షెడ్యూల్ ప్రకారం ద్విచక్ర వాహనదారులు, ఆటో, కారు, జీపు, లారీ డ్రైవర్లకు, పాఠశాల, కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించే అవకాశం ఉందన్నారు.

జిల్లా కేం ద్రం సీసీ కెమెరాల నిఘాలో ఉందని దొంగతనాలు, ప్రమాదాలు, స్త్రీలపై జరిగే నేరాలు, రాజకీయ, దైనందిన కార్యక్రమాలు, ధర్నాలు, ర్యాలీలు, మత పరమైన నేరాలను నియంత్రించడంలో, నేరం చేసిన వారి ని గుర్తించేందుకు వీలవుతుందని చెప్పారు. త్వరలో జరిగే వినాయక ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘ టనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పట్టణంలోని 60 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇవి శాశ్వతంగా ఉంచుతామని తెలిపారు. పట్టణంలో 56 సీసీ కెమెరాలు ఉండగా రోడ్డు పనుల విస్తరణలో వాటిని తొలగించారని, పనులు పూర్తికాగానే వాటిని కూడా ముఖ్య కూడళ్లలో అమర్చుతామన్నారు. నిర్మల్ నుంచి చించోలి వరకూ, నిర్మల్ నుంచి కొండాపూర్, చిట్యాల్ వరకూ అదనంగా 32 సీసీ కెమెరాలను అమర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా ప్ర జలకు మెరుగైన శాంతి భద్రతను అందించేందుకు పోలీసు శాఖ ముందుటుందని గుర్తు చేశారు.ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని ఆయా చోట్ల ఏర్పాట్లు చేసిన సీసీ కెమెరాల పనితీరును తిలకించారు. జిల్లాలో పోలీసు శాఖ కేసుల నమోదు, వాటి పరిష్కారాలను ఎస్పీ శశిధర్ రాజును అడిగి తెలుసుకున్నారు.

223
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles