రాజీయే రాచ మార్గం

Sun,September 9, 2018 12:53 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : రాజీ మార్గమే రాచమార్గమని, జాతీయ లోక్ అదాలత్‌లో కేసులు సత్వరమే పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక అన్నారు. శనివారం జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించారు. అనంతరం జిల్లా కోర్టులోని న్యాయమూర్తి ఛాంబర్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. న్యాయవాదులు, పోలీసులు కక్షిదారుల మధ్య రాజీ కుదుర్చాలన్నారు. గత లోక్ అదాలత్‌లో 1143 కేసులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోర్టుల్లో పరిష్కారం అయ్యాయని తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో వెయ్యికి పైగా కేసులను పరిష్కరిస్తామన్నారు. పోలీసులు, న్యాయవాదుల సహకారంతో కేసులు సత్వరమే పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. ప్రమాదాల బారిన పడి ఎందరో మంది మృతి చెందుతున్నారని, బీమా కంపెనీల ద్వారా న్యాయవాదులు కేసులను వాదించి బాధిత కుటుంబాలకు పరిహారం అందేలా చూడాలన్నారు. పది రోజుల ముందస్తు నుంచే జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రకటనల ద్వారా తెలియజేశామని చెప్పారు. కొంత మంది కక్షిదారులు వారి మధ్య రాజీ కుదుర్చుకొని కేసు పరిష్కారం కోసం వస్తున్నారని తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో ఇరువురిని పిలిపించి వారి ఇష్ట పూర్వకంగా రాజీ పడుతున్నట్లు తెలుసుకున్న అనంతరం కేసులను కొట్టి వేస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి జీవన్‌కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బిపిన్‌కుమార్ పటేల్ ఉన్నారు.

224
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles