ప్రజల్లోకి..

Sun,September 9, 2018 12:53 AM

ఆదిలాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : అసెం బ్లీ రద్దు తర్వాత తమ సొంత నియోజకవర్గాలకు చేరుకున్న మంత్రి జోగు రామన్న, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ప్రచారాన్ని ప్రారంభించారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలో మంత్రి జోగు రామన్న పలు కులసంఘాల నాయకులతో భేటీ అయ్యారు. నేరడిగొండ మండలం వెంకటాపూర్‌లో మాజీ ఎమ్మెల్యే బాపురావు తన ప్రచారాన్ని ప్రారంభించారు. గతేడాది సైతం ఇక్కడి నుంచే ఎ న్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సారి సైతం ఈ గ్రామాన్ని వేదికగా ఎంచుకున్నారు. ఆదిలాబాద్‌లో మంత్రి జోగు రామన్నను వివిధ కులసంఘాల నేతలు ఘనంగా సన్మానించగా.. వెంకటాపూర్‌లో స్థానికులు బాపురావుకు ఘనస్వాగతం పలికి తమ మద్దతు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను నాయకులు ప్రజలకు వివరించారు. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ తరపున పోటీ చేసే తనను ప్రజలు ఆశ్వీరదించాలని మంత్రి జోగు రామన్న కోరారు.

శనివారం జిల్లా కేంద్రంలోని బీసీ సంఘ భవనంలో బొందిలి రాజ్‌పుత్ సమాజ్, కొలిపూరలోని ఆరెకటిక సమాజ్ భవనంలో సమావేశమయ్యారు. దేశం లో ఎక్కడా లేని విధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం సం క్షేమ పథకాలను అ మలు చేసిందని తెలిపారు. కుల సంఘాలకు హైదరాబాద్‌లో స్థలాన్ని కేటాయించడంతో భవన నిర్మాణాల కు నిధులు మంజూరు చేసినట్లు మంత్రి పేర్కొన్నా రు. ఉమ్మడి రాష్ట్రంలో కనుమరుగైన కులవృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు భారీగా నిధులు కే టాయించామన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అన్ని గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు రహదారులను నిర్మించడంతో పాటు ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కల్పించామని పేర్కొన్నారు. జిల్లాలోని మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగపడిందని తెలిపారు.

అభ్యర్థులకు అండగా నిలుస్తున్న ప్రజలు..
జిల్లాలో రెండ్రోజులుగా స్థానికంగా ఉన్న ఇద్దరు అభ్యర్థులకు అన్ని వర్గాల ప్రజలు అండగా నిలుస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి భారీ సంఖ్యలో రైతు లు, కులవృత్తుల వారు, స్థానికులు భారీ సంఖ్యలో స్వయంగా తరలివచ్చి తమ మద్దతు పలుకుతున్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్, పత్తర్‌గట్టీ, కుమార్‌పేట్, శాంతినగర్, రాంమందిర్, బొక్కలగూడ, సుందరయ్యనగర్, కుర్షిద్‌నగర్ ప్రాం తాల్లో పర్యటించిన మంత్రి జోగు రామన్నకు ప్రజ లు నీరాజనాలు పలికారు. పలు వాడల్లో మహిళ లు, స్థానికులు మంగళహారతులు, డప్పు చప్పుళ్లతో ఘనస్వాగతం పలికారు. శనివారం సైతం వివిధ కులసంఘాలతో మంత్రి సమావేశం నిర్వహించగా.. స్థానికులు మంత్రికి ఘన స్వాగతం పలికి సంఘీభా వం ప్రకటించారు. బోథ్ నియోజకవర్గం అభ్యర్థి బాపురావు శుక్రవారం రాత్రి తలమడుగు మండ లం రుయ్యాడిలో పర్యటించగా.. స్థానికులు భారీగా తరలివచ్చారు. మంత్రికి స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది. శనివారం సైతం నేరడిగొండ మండలం వెంకటాపూర్‌లో ప్రజలు బాపురావును ఘనంగా సన్మానించి తమ మద్దతు ప్రకటించారు.

226
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles