రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి

Sun,September 9, 2018 12:52 AM

కడెం : మండలంలోని కన్నాపూర్ సమీపంలోని చెరువు వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అంబారిపేట గ్రామానికి చెందిన బైరి గోపాల్ శనివారం మృతిచెందాడు. శుక్రవారం సాయంత్రం కొండుకూర్ గ్రామానికి చెందిన పెద్ది రమేశ్, సంతు అనే యువకులు ఒక ద్విచ్రక వాహనం, అంబారిపేట గ్రామానికి చెందిన బైరి గోపాల్ మరో ద్విచక్ర వాహనంపై ఎదురెదురుగా వెళ్తున్న క్రమంలో వాహనాలు ఎదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పెద్ది రమేశ్, సంతుకు తీవ్ర గాయాలు కాగా, బైరి గోపాల్ కాలు, చెయ్యి విరగడంతో పాటు, అనేక చోట్ల గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ముగ్గురిని ప్రైవేట్ వాహనాల ద్వారా ఖానాపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బైరి గోపాల్‌కు తీవ్ర గాయాలవ్వడంతో శనివారం చికిత్స పొందుతూ మృతిచెందాడు. కొండుకూర్‌కు చెందిన పెద్ది రమేశ్, సంతును ఖానాపూర్ నుంచి మెరుగైన వైద్యం కోసం నిర్మల్, నిజామాబాద్‌కు తరలించినట్లు బంధువులు తెలిపారు. మైరి గోపాల్ మృతదేహానికి శనివారం ఖానాపూర్ ప్రభుత్వ దవాఖానలో పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సయ్యద్ ముజాహిద్ తెలిపారు.

229
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles