కారుదే జోరు..


Sat,September 8, 2018 12:43 AM

- టీఆర్‌ఎస్‌కు అండగానిలిచిన ఉమ్మడి ఆదిలాబాద్ ఓటర్లు
- ఆది నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన ఉద్యమ పార్టీ
- సాధారణ, ఉప ఎన్నికల్లోనూ గుబాళించిన గులాబీ
- 2004లో పశ్చిమాన.. 2009, 2010లో తూర్పున
- 2014 ఎన్నికల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన టీఆర్‌ఎస్
- తాజా అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసే దిశగా పార్టీ
నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఆది నుంచి ఉద్యమ పార్టీకి అండగా నిలిచారు. ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌కు ఉమ్మడి జిల్లా ఓటర్లు ఆరంభం నుంచి పట్టం కడుతున్నారు.. సాధారణ, ఉప ఎన్నికలు ఏవైనా.. ఎప్పుడొచ్చినా.. కారు తన జోరు కొనసాగించింది.. 2004 సాధారణ ఎన్నికల్లో పశ్చిమాన.. 2009లో తూర్పున గులాబీ గుబాళించింది.. 2010, 2011 ఉప ఎన్నికల్లోనూ తన సత్తాను చాటింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఇక త్వరలో నిర్వహించనున్న ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసే దిశగా టీఆర్‌ఎస్ ముందుకు సాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓటర్లు మరోసారి టీఆర్‌ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు.


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా 2001లో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఆది నుంచి అండగా నిలుస్తున్నారు. 2001లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పలు మండలాల జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు టీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. 2004 లో నిర్వహించిన సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ పశ్చిమ ఆదిలాబాద్ జిల్లాలో తన సత్తాను చాటింది. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంతో పాటు ముధోల్, బోథ్, ఖానాపూర్ నియోజకవర్గాలను సొంతం చేసుకుంది. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంలో టీఆర్‌ఎస్ నుంచి తక్కల మధుసుదన్‌రెడ్డి.. టీడీపీ అభ్యర్థి సముద్రాల వేణుగోపాలాచారిపై గెలిచారు. ఖానాపూర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ నుంచి అజ్మీరా గోవింద్ నాయక్.. టీడీపీ అభ్యర్థి రాథోడ్ రమేష్‌పై విజయం సాధించారు. బోథ్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ నుం చి సోయం బాపురావు.. టీడీపీ అభ్యర్థి గొడాం నగేశ్‌పై గెలుపొందారు. ముథోల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ నుంచి భోంస్లే నారాయణరావు పటేల్.. బీజేపీ అభ్యర్థి జగదీశ్ మాషెట్టి వార్‌పై విజయం సాధించారు. ఒక పార్లమెంట్, మూడు అసెంబ్లీ స్థానాలను టీఆర్‌ఎస్ పార్టీ దక్కించుకుంది. తెలంగాణ రాష్ట్ర సా ధన కోసం 2008లో టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ప దవులకు రాజీనామా చేయగా.. ఆదిలాబాద్ ఎంపీ తక్కల మధుసూదన్‌రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీ రా గోవింద్ నాయక్ తమ పదవులను వీడగా.. ఉప ఎన్నికల్లో వీరిద్దరు ఓడిపోయారు. బోథ్ ఎమ్మెల్యే సోయం బాపురావు, ముథోల్ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ కాంగ్రెస్‌లో చేరగా.. తమ పదవులకు రాజీనామా చేయలేదు.

2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తూర్పు ఆదిలాబాద్ జిల్లాలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిం ది. తూర్పు జిల్లాలో మంచిర్యాల, చెన్నూర్, సిర్పూర్(టి) నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ పార్టీ సత్తా చా టింది. మంచిర్యాల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ నుంచి గడ్డం అరవింద్‌రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావుపై విజయం సాధించారు. చెన్నూరు ని యోజకవర్గంలో టీఆర్‌ఎస్ నుంచి నల్లాల ఓదేలు.. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్‌పై గెలిచారు. సిర్పూర్(టి) నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కావేటి సమ్మయ్య.. కాంగ్రెస్ అభ్యర్థి కోనేరు కోనప్పపై గెలుపొందారు. తెలంగాణ కోసం 2010లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా.. తూర్పు జి ల్లాలోని ముగ్గురు టీఆర్‌ఎస్ ఎ మ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. ఆ వెంటనే నిర్వహించిన ఉప ఎన్నికల్లో ఈ మూడు స్థా నాలు టీఆర్‌ఎస్ పదిలంగా ఉంచుకుంది. మంచిర్యాల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి గడ్డం అరవింద్‌రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణారావుపై విజయం సాధించారు. చెన్నూరు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి నల్లాల ఓదేలు.. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్‌పై గెలిచారు. సిర్పూర్(టి) నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కావేటి సమ్మయ్య.. కాంగ్రెస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిపై విజయం సాధించారు. 2009 సా ధారణ, 2010 ఉప ఎన్నికల్లో తూర్పు జిల్లాలో మూడు స్థానాల్లో కారు తన సత్తా చాటింది.

2009ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గంలో టీడీపీ నుంచి గెలుపొందిన జోగు రామన్న.. 2011 లో టీడీపీతో పాటు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన.. 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో ఘన విజయం సా ధించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా జోగు రామన్న బరిలో దిగగా.. కాంగ్రెస్ అభ్యర్థి సి.రామచంద్రారెడ్డిపై గెలుపొందారు. 2014 సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని రెండు పార్లమెంట్, ఏడు అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే.. ఆదిలాబాద్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి జోగు రామన్న.. కాంగ్రెస్ అభ్యర్థి భార్గవ్ దేశ్‌పాండేపై గెలవగా.. బోథ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపురావు.. కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ జాదవ్‌పై విజయం సా ధించారు. ఖానాపూర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి అజ్మీరా రేఖానాయక్.. టీడీపీ అభ్యర్థి రితేష్ రాథోడ్‌పై గెలవగా.. ఆసిఫాబాద్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మి.. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కుపై గెలిచారు. బెల్లంపల్లిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య.. కాంగ్రెస్ అభ్యర్థి చిల్ముల శంకర్‌పై విజయం సాధించగా.. చె న్నూర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి నల్లాల ఓదేలు.. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్‌పై గెలుపొందారు. మంచిర్యాల లో టీఆర్‌ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్ రావు.. కాం గ్రెస్ అభ్యర్థి గడ్డం అరవింద్‌రెడ్డిపై విజయం సాధించారు. బీఎస్పీ నుంచి నిర్మల్‌లో గెలుపొందిన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సిర్పూర్(టి)లో గెలిచిన కోనేరు కోనప్పలు.. బీఎస్‌ఎల్‌పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. ఇక ముథోల్‌లో కాంగ్రెస్ నుంచి గడ్డిగారి విఠల్‌రెడ్డి గెలుపొందగా.. అనంతరం ఆయన టీఆర్‌ఎస్ పార్టీలో చేరడంతో పది నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు.

ఆదిలాబాద్ ఎంపీగా గొడాం నగేశ్ పోటీ చేయగా.. కాంగ్రెస్ అభ్యర్థి నరేశ్ జాదవ్‌పై ఘన విజయం సాధించారు. పెద్దపల్లి నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చే సిన బాల్క సుమన్.. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్‌పై గెలిచారు. జిల్లాలోని చెన్నూర్, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాలు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉండగా.. టీఆర్‌ఎస్ అభ్యర్థికి ఈ మూడు నియోజకవర్గాల్లో భారీ మెజారిటీ లభించింది. ఇక 2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మెజారిటీ జడ్పీటీసీలు టీఆర్‌ఎస్ వారే గెలువగా.. జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్‌గా టీఆర్‌ఎస్‌కు చెందిన వల్లకొండ శోభారాణి ఎన్నికయ్యారు. మెజారిటీ ఎంపీపీలు, ఎంపీటీసీ స భ్యులు టీఆర్‌ఎస్‌కు చెందినవారే గెలిచారు. అన్ని మున్సిపాలిటీల్లో మెజారిటీ కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌కు చెందిన వారే గెలవగా.. భైంసా మినహా అన్ని చోట్ల టీఆర్‌ఎస్‌కు చెందిన వారే మున్సిపల్ ఛైర్మన్లుగా ఉన్నా రు. ప్రస్తుతం ఇద్దరు, ముగ్గురు జడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు మినహా.. మిగతా వారంతా టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారు. రానున్న సాధారణ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ పూర్తి ఆధిపత్యం కొనసాగించనుంది. జిల్లాలోని 10అసెంబ్లీ స్థానాలను స్వీప్ చేసేందుకు సిద్ధమవుతోంది. జిల్లాలోని ప్రజలంతా టీఆర్‌ఎస్‌కే మొగ్గు చూపుతున్నారు.

828
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles